Ind vs Eng 2nd Test: తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు టీమిండియాను అంత తక్కువగా అంచనా వేయడం లేదు. కానీ, చెన్నై వేదికగానే జరగనున్న రెండో టెస్టులో నాలుగు మార్పులతో బరిలోకి దిగుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శనివారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.
కీలక పేసర్ జోఫ్రా ఆర్చర్ రెండు టెస్టు ఆడటం లేదు. మరోవైపు కీపర్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్ మిగిలిన మూడు టెస్టుల నుంచి తప్పించింది ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా(Team India)ను దెబ్బతీసిన డామ్ బెస్, రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను ఇబ్బంది పెట్టిన జేమ్స్ అండర్సన్ సైతం రెండో టెస్టుకు దూరం కానున్నారని కెప్టెన్ జో రూట్(Joe Root) తెలిపాడు.
Also Read: Virat Kohli కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేసిన England మాజీ క్రికెటర్
బెన్ ఫోక్స్, స్టూవర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్, మోయిన్ అలీలు రెండో టెస్టులో బరిలోకి దిగుతారని సైతం స్పష్టం చేశాడు. కీలకమైన చివరి 2 టెస్టులకు అందుబాటులో ఉంచేందుకుగానూ అండర్సన్‌కు విశ్రాంతి కల్పించారు. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డ్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాలను ఇంగ్లాండ్(England) కెప్టెన్ వెల్లడించాడు.
Also Read: Rahul tewatia got engaged: రాహుల్ తేవతియా నిశ్చితార్ధం అయిపోయింది..ఎవరితోనో తెలుసా
జాస్ బట్లర్ స్థానంలో ఫోక్స్ కీపర్‌గా బాధ్యతలు స్వీకరించనుండగా, జానీ బెయిర్‌స్టో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగనున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రలీ కుడి మణికట్టు గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడని తెలిసిందే. మరోవైపు టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సిరీస్‌లో మిగతా టెస్టుల్లో విజయం సాధించాలని విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా(Team India) భావిస్తోంది.
Also Read: ICC World Test Championship Final: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి Team India అవకాశాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook