PSPK: Pawan Kalyan తో రానా దగ్గుబాటి ఫైటింగ్

Rana Daggubati in Pawan Kalyan's film: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో సాగర్ కే చంద్ర ఓ సినిమాను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి ప్రారంభమైంది.

Last Updated : Jan 28, 2021, 09:15 PM IST
PSPK: Pawan Kalyan తో రానా దగ్గుబాటి ఫైటింగ్

Rana Daggubati in Pawan Kalyan's film: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో సాగర్ కే చంద్ర ఓ సినిమాను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిలపై పలు యాక్షన్ సన్ని వేశాలను షూట్ చేస్తున్నారు. ఫైట్ మాస్టర్ దిలీప్ సబ్బరాయన్ ఈ యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేస్తున్నాడు. రానా దగ్గుబాటి గురువారం నుంచే ఈ సినిమా షూటింగ్‌కి హాజరవుతుండగా.. రానా, పవన్ కళ్యాణ్‌ల మధ్య యాక్షన్‌ సన్నివేశాలను ఈ షెడ్యూల్లో పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. 

Sagar K Chandra డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే- డైలాగ్స్ ప్రముఖ డైరెక్టర్, మాటల మాంత్రికుడు Trivikram Srinivas అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను, తదితరులు ఇతర ముఖ్యుపాత్రలు పోషిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ కంపోజర్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. 

Also read : ముదురుతున్న Dil Raju, Kill Raju వివాదం.. వెనక్కి తగ్గని Warangal Srinu

Pawan Kalyan ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు షెడ్యూల్‌కి షెడ్యూల్‌కి మధ్య గ్యాప్‌లో క్రిష్ సినిమా షూటింగ్ కూడా కానిస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ని ( Actress Nidhi Aggerwal ) హీరోయిన్‌గా ఫైనల్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News