AP Panchayat Election 2021: స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అర్హులు, అనర్హుల వివరాలు ఇవే

AP Panchayat Election Candidates Eligibility: పంచాయతీ ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థి పేరు స్థానిక ఓటర్ల జాబితాలో కచ్చితంగా ఉండాలి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు 2021 బరిలో నిలవాలంటే ఎవరు అర్హులు, ఎవరు అనర్హులో తెలియాలందే ఈ వివరాలు చదవండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2021, 02:25 PM IST
  • ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ ఇంకా కొనసాగుతోంది
  • ప్రస్తుతం నిర్వహించవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం
  • ఎన్నికలు జరగాలంటున్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్
AP Panchayat Election 2021: స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అర్హులు, అనర్హుల వివరాలు ఇవే

AP Panchayat Election Candidates Eligibility: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ ఇంకా కొనసాగుతోంది. ఎన్నికలు ప్రస్తుతం నిర్వహించవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగుతున్నారు. ఈ విషయాన్ని పక్కనపెడితే ఏపీ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, ఎవరెవరు పోటీకి అనర్హులో ఇక్కడ అందిస్తున్నాం.

 

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అర్హతలు (Eligibility Of Candidates For AP Panchayat Elections)
- ముందుగా పంచాయతీ ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థి పేరు స్థానిక పంచాయతీ ఓటర్ల జాబితాలో కచ్చితంగా ఉండాలి. 

- మహిళా అభ్యర్థులయితే AP Panchayat Elections 2021 ఎన్నికల్లో వారికి కేటాయించిన రిజర్వ్ స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు అవకాశం ఉంది.

Also Read: SBI MF Retirement Benefit Scheme: మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ప్రారంభించిన SBI

- ఎస్సీలు, ఎస్టీలు, బీసీ అభ్యర్థులు తమకు కేటాయించిన స్థానాలతో పాటు అన్‌రిజర్వ్‌డ్ స్థానాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) స్థానిక ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.

- మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అభ్యర్థుల నామినేషన్ పరిశీలన సమయానికి 21 ఏళ్లకు తక్కువ వయసు ఉండకూడదు.

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రస్తుతం ఏదైనా పనికి కాంట్రాక్ట్ చేసుకుని ఉన్న వారిని అనర్హులుగా పరిగణిస్తారు.

Also Read: Jio Recharge Plans: మీకు అధికంగా డేటా కావాలా, Reliance Jio 5 బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే

- ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు కనుక నియమాల ప్రకారం.. ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానాన్ని కలిగి ఉన్న వ్యక్తులను అనర్హులుగా భావిస్తారు. అయితే పంచాయతీ రాజ్ చట్టం అమలులోకి రాకముందు ఇద్దరి కన్నా అధిక సంతానం ఉన్నవారు అర్హులు అవుతారు.

- ఏపీ పంచాయతీ రాజ్ చట్టం, 1994 తర్వాత ఏడాది సమయంలోపు జన్మించిన అదనపు లేక మూడవ శిశువును పరిగణనలోకి తీసుకోకూడదు. ఆ విధంగా మూడో సంతానం పొందిన వారిని అర్హులుగా చెప్పవచ్చు.

Also Read: Local Body Elections issue: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నిమ్మగడ్డ

- ఏదైనా కేసులో నేరం రుజువై శిక్ష అనుభవించిన తర్వాత, ఐదేళ్ల గడువులోపు స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హత ఉండవు. 5 ఏళ్లు దాటిన వారు పోటీ చేయవచ్చు.

-  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగం చేస్తున్నవారు, కొన్ని ఇతర పదవులు నిర్వహిస్తున్న వారిని సైతం అనర్హులుగా పరిగణిస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News