Mohammed Siraj Dismisses Labuschagne and Matthew Wade in a Over: ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో రాణించలేకపోయిన టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరుగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక వికెట్ పడగొట్టిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో ఒకే ఓవర్లో ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లను పెవిలియన్ బాట పట్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకూ 3 వికెట్లు తీశాడు.
నిర్ణయాత్మక నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఆస్ట్రేలియా 57 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 31వ ఓవర్‌లో టీమిండియా(Team India) బౌలర్ మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మూడో బంతికి కీలక ఆటగాడు లబుషేన్(25)ను వెనక్కి పంపిన సిరాజ్.. ఓవర్ ఆఖరి బంతికి మాథ్యూ వేడ్‌ను డకౌట్ చేశాడు.
Also Read: India vs Australia 4th Test: వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
ఆసీస్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ శర్మ అందుకోవడంతో నిరాశగా పెవిలిన్ బాట పట్టాడు. ఆపై మాథ్యూ వేడ్ భారత కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఖాతా తెరవకుండా వికెట్ సమర్పించుకున్నాడు. సీనియర్ బౌలర్లు అందుబాటులో లేని సమయంలో జట్టులోకి వచ్చిన సిరాజ్(Mohammed Siraj) అంచనాల మేర రాణిస్తున్నాడు.
Also Read: How To Secure Whatsapp: ఈ టిప్స్ పాటిస్తే మీ వాట్సాప్ డేటా సేఫ్
India strikes twice❗️
Mohammed Siraj dismisses Marnus Labuschagne and Matthew Wade in 1️⃣ over.#AUSvIND | https://t.co/oDTm209M8z pic.twitter.com/MPjtxf4vUc
— ICC (@ICC) January 18, 2021
అనంతరం 55వ ఓవర్‌లో మరోసారి భారత జట్టుకు బ్రేకిచ్చాడు మహమ్మద్ సిరాజ్. ఆసీస్ కీలక ఆటగాడు స్టీవ్ స్మిత్(55; 74 బంతుల్లో 7 ఫోర్లు)ను పెవిలియన్ చేర్చాడు. టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే క్యాచ్ అందుకోవడంతో స్మిత్ నిరాశగా వెనుదిరిగాడు.
Also Read: Devdutt Padikkal టీమిండియాలోకి రావడం ఖాయమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook