రాబోయే 2019 సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎవరి మద్దతు ఇస్తారో చెప్పేశారు. ఎవరైతే రైతులకు అండగా ఉంటారో.. వారికి తాను మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. శనివారం అనంతపురంలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన.. రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రైతాంగాన్ని ఎవరైతే ఆదుకుంటారో, రైతుల కన్నీళ్లను ఎవరైతే తుడుస్తారో వారికే మద్దతు అని చెప్పారు.
ఏ పార్టీకైనా మద్దతిచ్చే ముందు అనంతపురానికి ఎలా అండగా నిలబడతారని అడుగుతానని పవన్ అన్నారు. రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని.. అనంతపురం ప్రజల మద్దతు కావాలని కోరారు. ఎన్నికలప్పుడు ఓటర్లవద్దకు రాజకీయ నాయకులు వచ్చి ఓట్లువేయమని అడుగుతారని.. అనంతపురానికి ఏం చేసారని ప్రశ్నించాలని అన్నారు. అనంతపురం ప్రజలు ఇష్టమైతేనే జనసేన పార్టీకి ఓటు వేయాలని అన్నారు. 2019 లో అనంతపురం ఓటర్లు ఒక్కతాటిపై రాకపోతే సమస్యలు పరిష్కారం కావని చెప్పారు.
JanaSena Party Chief @PawanKalyan interaction with Farmers - Anantapur #AnantapurWelcomesJANASENA pic.twitter.com/pvADvItdlG
— JanaSena Party (@JanaSenaParty) January 27, 2018