గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకి కేంద్ర ప్రభుత్వం నేడు పద్మ అవార్డులు ప్రకటించింది. అవార్డుగ్రహీతల్లో ముగ్గురికి పద్మ విభూషణ్, 9మందికి పద్మభూషణ్, 73 మందిని పద్మ శ్రీ పురస్కరాలు వరించాయి.
పద్మ అవార్డుగ్రహీతల జాబితా వివరాలు ఇలా వున్నాయి.
పద్మ విభూషణ్ అవార్డుగ్రహీతలు:
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా - పద్మ విభూషణ్ ( ఆర్ట్, మ్యూజిక్ )
గులాం ముస్తఫా ఖాన్ - పద్మ విభూషణ్ ( ఆర్ట్, మ్యూజిక్ )
పరమేశ్వరన్ - పద్మ విభూషణ్ ( సాహిత్యం, విద్య )
పద్మ భూషణ్ అవార్డుగ్రహీతలు:
మహేంద్ర సింగ్ ధోనీ- పద్మభూషణ్ (క్రీడలు)
పంకజ్ అద్వానీ - (క్రీడలు)
ఫిలిపోస్ మర్ క్రిసోస్టొమ్ ( ఆధ్యాత్మికం)
అలెగ్జాండర్ కడకిన్ (విదేశీయుడు- రష్యా) ( ప్రజా వ్యవహారాలు )
రామచంద్రన్ నాగస్వామి - పురావస్తు శాస్త్రవేత్త
వేద్ ప్రకాశ్ నంద - (సాహిత్యం, విద్య)
లక్ష్మణ్ పై ( ఆర్ట్, పెయింటింగ్)
అరవింద్ పారిఖ్ ( ఆర్ట్, మ్యూజిక్)
శారదా సిన్హా - ( ఆర్ట్, మ్యూజిక్)
పద్మశ్రీ అవార్డు గ్రహితలు:
కిదాంబి శ్రీకాంత్- పద్మ శ్రీ (క్రీడలు)
అరవింద్ గుప్తా (శాస్త్రవేత్త) మహారాష్ట్ర
లక్ష్మీ కుట్టి - కేరళ
ఎంఆర్ రాజగోపాల్ (వైద్య వృత్తి) - తమిళనాడు
బజ్జూ శ్యామ్ (కళారంగం) - మధ్యప్రదేశ్
బిశ్వాస్ (సేవారంగం) - బెంగాల్
సులగట్టి నర్సమ్మ (వైద్య వృత్తి) - కర్ణాటక-
నవనీతకృష్ణన్ (విద్యారంగం) - మహారాష్ట్ర
యేషి ధోడెన్ (వైద్యరంగం) - హిమాచల్‌ప్రదేశ్
మురళీకాంత్ పెట్కర్ (క్రీడారంగం) - మహారాష్ట్ర
సుభాషిణి మిస్త్రీ (సామాజికసేవ) - బెంగాల్
రాజగోపాలన్ వాసుదేవన్ (సైన్స్-ఇంజినీరింగ్) - తమిళనాడు
లెంటినా ఠక్కర్- (సమాజ సేవ) - నాగాలాండ్
రాణి అభయ్ బాంగ్- (వైద్యరంగం) - మహారాష్ట్ర
సందుఖ్ రుట్ (వైద్యరంగం) - నేపాల్
సంపత్ రామ్ టెకే (సమాజసేవ) - మహారాష్ట్ర
నౌఫ్ మర్వాయి (యోగా) - సౌదీ అరేబియా
సీతవ్వ(సామాజిక సేవ) - కర్నాటక
ఇబ్రహీం సుతార్ (సంగీతం) - కర్నాటక
మనాస్ బిహారీ వర్మ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - బిహార్
అన్వర్ జలల్పురి (విద్యారంగం) - ఉత్తరప్రదేశ్
వి.నానమ్మల్ (యోగా) - తమిళనాడు
మనోజ్ జోషి ( ఆర్ట్, యాక్టింగ్ ) మహారాష్ట్ర
మాలతి జోషి ( సాహిత్యం, విద్య ) మధ్యప్రదేశ్
ప్రాణ్ కిషోర్ కౌల్ ( ఆర్ట్ ) జమ్మూ కాశ్మీర్