ఏడు జన్మలెత్తినా.. ధోనీలా స్టంప్ ఔట్ చేయలేరు!

ఏదేమైనా బ్యాట్స్‌మన్‌ని స్టంప్ ఔట్ చేయడంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్టైలే వేరు.

Last Updated : Jan 31, 2018, 12:56 AM IST
ఏడు జన్మలెత్తినా.. ధోనీలా స్టంప్ ఔట్ చేయలేరు!

ఏదేమైనా బ్యాట్స్‌మన్‌ని స్టంప్ ఔట్ చేయడంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్టైలే వేరు. అందులో అతడికి ఇంకెవ్వరు పోటీ లేరు. అతడిలా స్టంప్ ఔట్ చేయాలన్నా..  వేల సంఖ్యలో పరుగులు సాధించాలన్నా మరో ఏడు జన్మలు ఎత్తాల్సిందే. ఇది మహేంద్ర సింగ్ ధోనీ అభిమాని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్ మైఖెల్ వాన్‌కి ఘాటుగా ఇచ్చిన సమాధానం. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని, ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్‌‌ల మధ్య ఎవరో ఒక్కరినే ఎంచుకోవాల్సి వస్తే, మీరైతే ఎవరిని ఎంచుకుంటారు అంటూ మైఖెల్ వాన్ ట్విట్టర్‌లో నిర్వహించిన ఓపెన్ పోల్‌కి భారీ స్పందన కనిపించింది. క్రికెట్ ప్రపంచంలో శిఖరం లాంటోడు ధోనీకి, జోస్ బట్లర్‌కి పోలిక ఏంటంటూ మైఖెల్ వాన్‌కి వాతలు పెట్టినంత పనిచేశారు ధోనీ అభిమానులు.

 

ఇండియన్ క్రికెట్ గాడ్ ధోనీకి ఆటలో బచ్చగాడు లాంటోడు బట్లర్‌కి మధ్య పోలిక ఏంటంటూ మైఖెల్ వాన్‌పై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. తనకు ట్విటర్‌లో ఇండియన్స్ ఇచ్చిన సమాధానాలకి మైఖెల్ వాన్‌కి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది. అంతేకాదు.. ఇంకెప్పుడూ ఓ భారతీయుడికి, ఇంగ్లాండ్ క్రికెటర్‌కి మధ్య పోలింగ్ పెట్టకూడదు అంటూ తనకు తానే బుద్ధి చెప్పుకుంటున్నట్టుగా మరో ట్వీట్ పోస్ట్ చేశాడు మైఖెల్ వాన్. దటీజ్ ధోనీ.. మహేంద్ర సింగ్ ధోనికి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్. 

Trending News