Wild Dog Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడు అక్కినేని నాగార్జున అప్‌కమింగ్ మూవీ వైల్డ్‌డాగ్. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందనే ఆసక్తి నెలకొంది చిత్ర పరిశ్రమలో. అయితే థియేటర్లలో కాకుండా ఓటీటీలో సినిమా విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
టాలీవుడ్ నటుడు నాగార్జున ( Tollywood actor Nagarjuna ) ప్రధాన పాత్రలో..ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా వైల్డ్‌డాగ్ ( Wild Dog ) పై అందరి దృష్టీ నెలకొంది. నవంబర్ నెలలో షూటింగ్ పూర్తి చేసుకున్న వైల్డ్‌డాగ్..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ( Post production ) పనుల్లో ఉంది. ఇటు సినీ వర్గాల్లో అటు అభిమానుల్లో ఈ సినిమా విడుదలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం థియేటర్లు ప్రారంభమైనా సరే..ప్రేక్షకులు ధియేటర్లకు రావడానికి ఇంకా ఇష్టం చూపించడం లేదు. ఈ నేపధ్యంలో వైల్డ్‌డాగ్ మూవీని...థియేటర్లలో కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ( Ott Platform ) పైనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. కరోనా వైరస్ సంక్రమణ, లాక్డౌన్ ( Lockdown ) నేపధ్యంలో థియేటర్లు మూతపడినప్పటి నుంచీ చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైనే విడుదలయ్యాయి. ప్రస్తుతం థియేటర్లు ప్రారంభమైనా సరే..ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ కన్పించని పరిస్థితి నెలకొంది.
అందుకే రిస్క్ తీసుకోకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్ వేదికలపైనే సినిమా విడుదల చేయాలనేది ఓ ఆలోచనగా ఉంది. అధికారికంగా సమాచారం లేకపోయినా నెట్‌ఫ్లిక్స్ ( Netflix ) లో నాగార్జున నటించిన వైల్డ్‌డాగ్ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా హక్కుల్ని విక్రయించినట్టు సమాచారం. 27 కోట్లకు వైల్డ్‌డాగ్ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అహిషోర్ సోలోమాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( National Investigation Agency ) ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కన్పించబోతున్నారు. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు దియా మీర్జా, సయామి ఖేర్, అలీ రెజా నటిస్తున్నారు.
Also read: Tollwood: లూసిఫర్ రీమేక్‌లో చిరంజీవి సరసన నటించే నటి ఎవరో తెలుసా