Gas Cylinder price: గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయిందని ఆందోళన చెందుతున్నారా..గూగుల్ పే మీకు శుభవార్త అందిస్తోంది. గూగుల్ పే ద్వారా సిలిండర్ బుక్ చేసుకోండి..భారీ డిస్కౌంట్ పొందండి.
వంటగ్యాస్ ధర ( Gas cylinder price ) ఈ మధ్యకాలంలో అమాంతం పెరిగిపోతోంది. అందుకే మీకు గూగుల్ పే ( Google pay ) సరికొత్త డిస్కౌంట్ ప్రకటించింది. గూగుల్ పే ఆప్షన్ ద్వారా సిలెండర్ బుక్ చేసుకున్నవారికి గుడ్‌న్యూస్ అందిస్తోంది. గూగుల్ పేతో పాటు ఇతర డిజిటల్ పేమెంట్స్ ( Digital payments ) కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం..వెంటనే డిజిటల్ పేమెంట్స్ ద్వారా మీ సిలిండర్ బుక్ చేసుకోండి. మంచి డిస్కౌంట్ పొందండి.
గ్యాస్ బుకింగ్ ( Gas Booking )పై గూగుల్ పే భారీ తగ్గింపు ప్రకటించింది. గూగుల్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే..కనీసం పది రూపాయల్నించి 5 వందల వరకూ తగ్గింపు లభిస్తుంది. అయితే గూగుల్ పే ద్వారా మీరు కనీసం 5 వందల రూపాయలైనా ( Five hundred discount ) లావాదేవీ నిర్వహించి ఉంటే..ఇది వర్తిస్తుంది. బుక్ చేసిన వెంటనే మీకొక స్క్రాచ్ కార్డు వస్తుంది. ఆ స్క్రాచ్ కార్డు ( Scratch card ) ద్వారా మీ అదృష్టాన్ని బట్టి పది రూపాయల్నించి మొదలుకుని 5 వందల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. మీ అదృష్టం బాగుండి ఏకంగా 5 వందల రూపాయల డిస్కౌంట్ లభిస్తే మాత్రం దాదాపుగా మీకు సిలెండర్ 2 వందలకే లభించినట్టవుతుంది.
కేవలం గూగుల్ పే మాత్రమే కాదు..పేటీఎం ( Paytm ) , ఎయిర్టెల్ ( Airtel payments bank ) పేమెంట్స్ బ్యాంక్ కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై 30 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాయి. సిలిండర్ల ధరల్లో ఇక నుంచి ప్రతివారం మార్పు ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో డిజిటల్ పేమెంట్స్ సంస్థలు వినియోగదార్లను ఆకట్టుకోడానికి వివిధ రకాలైన ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
Also read: Action Games: గేమ్ లవర్స్ బాగా ఇష్టపడిన యాక్షన్ గేమ్స్ ఇవే