పాచికలు ఆడి దుర్యోధనుడు చేతిలో పరాజయంపాలైన అర్జునుడు ఆ తర్వాత శివుడి నుంచి ఆయధ శక్తిని పొందడం కోసం ఇంద్రకీలాద్రిపైకి వెళ్లి ఘోర తపస్సుకు పూనుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత అర్జునుడి ఘోర తపస్సు కారణంగా అక్కడ అంతా దట్టమైన పొగ అలుముకోవడంతో అదే కొండపై తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులు వెళ్లి శివుడికి మొరపెట్టుకున్నారు. దీంతో మీ సమస్య నేను పరిష్కరిస్తానని చెప్పి వారిని అక్కడి నుంచి పంపించేసిన శివుడు.. పార్వతిపైపు తిరిగి నువ్వు ఏదో సందేహంతో ఉన్నట్టున్నావు.. అదేంటో అడుగు అంటూ ప్రశ్నించాడు. శివుడి ప్రశ్న విన్న పార్వతి స్పందిస్తూ.. ఆయధ శక్తి కోసం అర్జునుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నువ్వు అర్జునుడికి ఆ శక్తిని ప్రసాదిస్తే... అతడు ఆ శక్తిని దేని కోసం ఉపయోగిస్తాడోనని సందేహం వ్యక్తంచేసింది పార్వతి.
పార్వతి ప్రశ్నకు తన చూపుతోనే సమాధానం ఇచ్చిన శివుడు... మనం మారువేషంలో వెళ్లి అతడి వైఖరిని పరీక్షిద్దాం అని బయల్దేరుతారు. శివుడు కొయ్య దొరలాగా వెళ్లగా.. పార్వతి అదే కొండ జాతికి చెందిన స్త్రీ రూపంలో బయల్దేరారు. కైలాసంలోని తమ సేవకులను కొండ జాతికే చెందిన స్త్రీలుగా మార్చి వారిని తమ వెంట తీసుకుని వెళ్తారు శివుడు.
శివుడు, పార్వతి ఇంద్రకీలాద్రిని ( Indrakeeladri ) సమీపిస్తున్న తరుణంలోనే వారికి ఓ అడవి పంది కనిపించింది. దానిని చూసిన పార్వతి... అది మామూలు అడవి పందిలా కనిపించడం లేదని శివుడితో చెబుతుంది. అది విన్న శివుడు... నువ్వు చెప్పింది నిజమే.. అది మామూలు పంది కాదు... పంది రూపంలో ఉన్న రాక్షసుడు అని చెబుతాడు. మునీశ్వరుల తపస్సును భగ్నం చేయడానికే ఇలా పంది రూపంలో వచ్చాడని శివుడు పార్వతికి ( Goddess Parvathi ) చెబుతాడు. వెంటనే తన బాణాన్ని ఎత్తి పందికి గురిచూసి కొట్టబోగా... శివుడిని గమనించిన అసురుడు అక్కడి నుంచి అర్జునుడు తపస్సు చేసుకునే ప్రాంతానికి పరుగెత్తుతాడు. అడవి పంది రాక చూసిన మునీశ్వరులు ప్రాణాలు దక్కించుకోవడం కోసం అక్కడి నుంచి పరిగెత్తగా.. అర్జునుడు మాత్రం తన విల్లును ఎత్తి అడవి పంది వైపు గురిపెడతాడు.
Also read : Karthika Purnima: కార్తిక మాసం ఎందుకు పవిత్రం ? కార్తిక పౌర్ణమినాడే 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు ?
అదే సమయంలో కొయ్య దొర రూపంలో ఉన్న శివుడు ( Lord Shiva ) అక్కడికి చేరుకుని అర్జునుడిని వారిస్తాడు. ''ఆ అడవి పందిని తాను వెదుక్కుంటూ వస్తున్నాని, అదే తన లక్ష్యం'' అని చెబుతాడు. అయితే కొయ్య దొర మాటలను ధిక్కరించిన అర్జునుడు.. '' నేను ఒకసారి విల్లు ఎత్తాకా దించడం అనేది ఉండదని.. అది నీదో నాదో విల్లుతోనే తేల్చుకుందాం'' అని సవాలు విసురుతాడు.
అలా అడవి పంది రూపంలో ఉన్న అసురుడిపైకి ( Asura ) ఇద్దరూ బాణాలు సంధించగా.. ఆ అడవి పంది ప్రాణాలు వదులుతుంది. అయితే అక్కడే అసలు సమస్య తలెత్తుతుంది. తన బాణం వల్లే అడవి పంది చనిపోయింది అంటే.. తన బాణం వల్లే అంటూ ఇద్దరూ వాగ్వీవాదానికి దిగుతారు. దీంతో మరోసారి అర్జునుడు శివుడి రూపంలో ఉన్న కొయ్యదొరకు సవాలు విసురుతాడు. ఈసారి మనం ఇద్దరం పోటీపడదామని.. ఎవరు గెలిస్తే వారి వల్లే ఆ అడవి పంది చనిపోయినట్టు భావించాల్సి ఉంటుందని అర్జునుడు సవాలు విసురుతాడు.
శివుడి కోసం ఘోర తపస్సు చేస్తున్న అర్జునుడు ( King Arjuna ) అలా తనకు తెలియకుండానే శివుడిపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగిన కొద్దిసేపటి తర్వాత అర్జునుడి వద్ద ఆయుధాలు అయిపోతాయి. అది చూసిన ఆ కొయ్య దొరే అర్జునుడికి ఆయుధాలు అందిస్తాడు. అయితే కొయ్య దొర ఇచ్చిన ఆయుధాలను తీసుకోవడానికి మనసొప్పుకోని అర్జునుడు ఈసారి ఖడ్గంతో యుద్ధానికి దిగుతాడు. అది కూడా కొయ్య దొర శరీరాన్ని తాకడంతోనే పూలుగా మారిపోతుంది. దీంతో ఆ కొయ్య దొరతో యుద్ధానికి తన శక్తి సరిపోదని గ్రహించిన అర్జునుడు.. వెనక్కి తిరిగి వెళ్లి మళ్లీ శివలింగం ( Shiva lingam ) వద్ద కూర్చుని '' ఓం నమఃశివాయ.. ఓం నమఃశివాయ '' అంటూ ఘోర తపస్సుకు పూనుకుంటాడు.
తాను ఏదో తెలియని శక్తిని పొందినట్టు గుర్తించిన అర్జునుడు.. వెంటనే తపస్సు మీద నుంచి లేచి మునుపటి కంటే మరింత పౌరుషంతో ఆ కొయ్య దొరకు వెళ్తాడు. తనకు శివుడు మహాశక్తిని ప్రసాదించాడని, నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నాతో తలపడు అని సవాలు విసురుతూ కొయ్యదొరను సమీపిస్తాడు. కానీ అంతలోనే ఆ కొయ్య దొర మెడలో శివలింగం వేలాడటం గమనించిన అర్జునుడు వెంటనే తన తప్పు తెలుసుకుని అసలు నిజాన్ని గ్రహిస్తాడు. తనకు తెలియకుండానే తాను ఆ మహా శివుడితో యుద్ధానికి దిగానని గ్రహించి సిగ్గుపడుతాడు. శివుడి ముందు మొకరిల్లి జరిగిన తప్పిదానికి తనను క్షమించాల్సిందిగా వేడుకుంటాడు.
అర్జునుడి భక్తికి మెచ్చిన శివుడు... అప్పుడు అసలు రూపంలో ప్రత్యక్షమై.. ఓ అర్జునా... నీ భక్తికి మెచ్చి ఇది నేను ఇస్తున్న వరం అంటూ పాశుపతాస్త్రాన్ని ( Pashupatastram ) అందిస్తాడు. అది నీకు యుద్ధంలో తోడు ఉంటుంది.. మహాశక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పి అదృశ్యమవుతారు.
ఆ తర్వాత జరిగిన మహాభారత యుద్ధంలో కర్ణుడిపై అదే పాశుపతాస్త్రం ప్రయోగించి అర్జునుడు విజయం సాధిస్తాడు.
Also read : Ram Mandir In Ayodhya: అయోధ్యలో శ్రీరాముడి ఆలయం చుట్టూ సీతా అశోక చెట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Fight of Arjuna and Lord Shiva: శివుడి కోసం ఘోర తపస్సు చేస్తూనే శివుడిపై యుద్ధం