Ammavodi scheme: అమ్మఒడి పథకం కోసం ఎదురుచూస్తున్నారా..జాబితాలో మీ పేరు లేదా..అనర్హుల జాబితాను సవరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది..అమ్మఒడి పథకం కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పథకం మీకు వర్తించలేదని బాధపడుతున్నారా..ఆ జాబితాను సవరించేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ పథకం వర్తించనివారు అధికారుల చుట్టూ తిరగకుండా మీ గ్రామ సచివాలయాల్లోనే సమస్యను పరిష్కరించుకోవచ్చు. జాబితా సవరణ కోసం గ్రామ సచివాలయాల్లోనే లాగిన్ సౌకర్యం కల్పిస్తోంది. సచివాయల సిబ్బందే అనర్హుల జాబితాను సవరించేందుకు వీలుగా ఎడిట్ ఆప్షన్ ఇస్తోంది.
ప్రస్తుతం పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో ప్రభుత్వ విద్యార్ధుల జాబితా ఎంటర్ చేసే పని ప్రారంభించింది. అర్హులు, అనర్హులు, నిలిపివేసి దరఖాస్తుల జాబితాను వెబ్సైట్లో ఉంచింది. అనర్హులు , నిలిపివేసిన జాబితాలో ఉన్న విద్యార్ధుల తల్లులు ఆందోళన చెందకుండా ఉండేందుకు గ్రామ సచివాలయాలకు వెళ్లి సంబంధిత డాక్యుమెంట్లు అందజేయాల్సి ఉంటుంది.
అమ్మఒడి ( Ammavodi Scheme ) వెరిఫికేషన్‌కు సంబంధించి వీలైనంత త్వరగా వెరిఫికేషన్ పూర్తి చేసి వివరాల్ని ఎంపీడీవోకు పంపించాలని ప్రభుత్వం ( Ap Government ) ఆదేశాలు జారీ చేసింది. వెరిఫికేషన్ పూర్తయిన తరువాత రెండోసారి సవరించిన జాబితాను మండలాధికారులకు పంపించాలి. ఏ కారణంతోనైనా జాబితాలో మీ పేరు లేకపోతే చేర్పించేందుకు వీలుగా ప్రభుత్వం సవరణ సౌకర్యం కల్పించింది.
Also read: AP: మూడేళ్ల డిగ్రీ లేదిక..మళ్లీ తెరపైకి నాటి బ్రిటీషు కాలం నాటి ఆనర్స్ డిగ్రీ
అమ్మఒడి పథకానికి అర్హతలు ( Ammavodi Eligibility )
గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు పదివేలు, పట్టణ ప్రాంతాల్లో 12 వేలు మించకూడదు. ఒక కుటుంబానికి మాగాణి 3 ఎకరాలు, మెట్టభూమి అయితే పది ఎకరాలు దాటకూడదు. లేదా రెండూ కలిపి పది ఎకరాలు దాటి ఉండకూడదు. విద్యుత్ బిల్లు నెలకు 3 వందల యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించకూడదు. లేదా ఆరు నెలల సగటు తీసుకుంటే 18 వందల యూనిట్లు దాటకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారుల పిల్లలకు అమ్మఒడి పథకం వర్తించదు.
కుటుంబంలో ఎవరి పేరు మీదైనా ఫోర్ వీలర్ ఉంటే అమ్మఒడి వర్తించదు. అయితే ట్రాక్టర్, టాక్సీ, ఆటోలకు మినహాయింపు ఉంది. గతంలో ఆదాయపు పన్ను చెల్లించినవారు అనర్హులు. మున్సిపాలిటీలలో వేయి చదరపు అడుగులు, గ్రామాల్లో 12 వందల చదరపు అడుగుల ఇంటి స్థలముంటే అమ్మఒడి పథకం వర్తించదు.
అమ్మఒడి అర్హతల్ని( Eligibilities ) పరిశీలించుకుని..అయినా మీకు రాలేదంటే మాత్రం కచ్చితంగా సవరించుకుని అర్హత పొందవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది.
Also read: West Bengal: మమతా కీలక నిర్ణయం.. తెలుగు భాషకు అధికార హోదా