AAP: ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ఢిల్లీలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత పార్టీని విస్తరించే క్రమంలో యూపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
2021లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ( Up Assembly Elections ) జరగనున్న నేపధ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ( Aam aadmi party ) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Delhi cm arvind kejriwal ) కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే యూపీ ఎన్నికల బరిలో ఆప్ పోటీ చేస్తుందని తెలిపారు. ఢిల్లీలో మూడోసారి అధికారం చేజిక్కించుకున్నాక పార్టీని విస్తరించే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నారు. యూపీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నామో కూడా వివరించారు.
ఢిల్లీ ( Delhi ) మాదిరిగానే తమ రాష్ట్రంలో కూడా పరిపాలన అందించాలని, సౌకర్యాలు కావాలనేది యూపీ ప్రజల ఆకాంక్ష అని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. వైద్య అవసరాలు, విద్య ఇతర సౌకర్యాల కోసం యూపీ ప్రజలు ప్రతిసారీ ఢిల్లీపై ఎందుకు ఆధారపడాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ సౌకర్యాలన్నీ సొంత రాష్ట్రంలోనే వారికి అందించాలనే లక్ష్యంతో రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిర్ణయం తీసుకున్నామన్నారు. యూపీలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు ద్రోహం చేశాయని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పటివరకూ అవినీతి విషయంలో అన్ని ప్రభుత్వాలు ఒకదాని కంటే మరొకటి మించిపోయాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ( Aap Government ) ఏర్పాటు ద్వారా యూపీ ప్రజలకు మంచి రోజులు రానున్నాయని జోస్యం చెప్పారు. తమ పార్టీకు ఓ అవకాశం ఇవ్వాలని యూపీ ప్రజల్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్ధించారు. నిజాయితీ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్న ఢిల్లీ ప్రజలు తమపార్టీకి అధికారాన్ని అందించారని..యూపీ ప్రజలకు సైతం నిజాయితీ కలిగిన రాజకీయ పార్టీ అవసరమన్నారు.
Also read: Weird News: షాకింగ్, వీధి కుక్కకు తిండి పెట్టలేదని సొంత చెల్లినే...