Telangana: కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం

CoronaVirus cases in Telangana: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రాణాంతక వైరస్ మహమ్మారి వ్యాప్తి ఇంకా రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో నిన్న రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 643 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Last Updated : Dec 10, 2020, 11:51 AM IST
  • తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం
  • తాజాగా 643 కరోనా పాజిటివ్ కేసులు
  • 1,482కి చేరిన కరోనా వైరస్ మరణాలు
Telangana: కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం

Covid-19 cases in Telangana:  తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రాణాంతక వైరస్ మహమ్మారి వ్యాప్తి ఇంకా రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో నిన్న రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 643 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,904కి చేరింది.

నిన్న ఒక్కరోజే 53,396 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. దీంతో తెలంగాణ (Telangana)లో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,482కి చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 805 మంది చికిత్స అనంతరం కరోనా వైరస్ (CoronaVirus) బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ 2,66,925 మంది కోలుకున్నారు. 

Gallery : Niharika Konidela Wedding Photos: నటి నిహారిక వివాహ వేడుక ఫొటో గ్యాలరీ

తెలంగాణలో ప్రస్తుతం  7,497 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో 5,434 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. కరోనా రికవరీ రేటు జాతీయ సగటు కన్నా తెలంగాణ మెరుగ్గా ఉంది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 96.74 శాతం ఉండగా, జాతీయ సగటు 94.7శాతానికి చేరింది.

Also Read : Boy Flying in The air with a Kite: గాలిపటంతో 30 అడుగుల వరకు ఎగిరిన బాలుడు.. ఆ తర్వాత ఏమైంది! 

 

Also Read : Rise in Prices: టీవీ, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల ధరలు షాక్.. త్వరలో భారీగా పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News