HIV Injection: ప్రాణాంతకమైన హెచ్ఐవీ చికిత్స కోసం చాలా కాలంగా జరుగుతున్న పరిశోధనలు కొలిక్కి వచ్చాయి. హెచ్ఐవీ నుంచి రక్షణ కల్పించే ఔషధం కనుగొన్నారు. లెనకపవిర్ ఇంజెక్షన్ ఏడాదికి రెండుసార్లు చేస్తే పూర్తి రక్షణ లభిస్తోందని క్లినికల్ స్డడీస్‌లో వెల్లడైంది.
హెచ్ఐవీ చికిత్సలో లెనకపవిర్ ఇంజక్షన్ అద్భుతమైన ఫలితాలనిస్తోందని దక్షిణాఫ్రికా, ఉగాండాల్లో జరిగిన క్లినికల్ పరీక్షల్లో వెల్లడైంది. ప్రస్తుతం ఇస్తున్న ట్యాబ్లెట్స్ కంటే లెనకపవిర్ ఇంజక్షన్ మెరుగా పనిచేస్తున్నట్టుగా క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. హెచ్ఐవీ వైరస్2లోని జన్యు పదార్ధం, ఎంజైమ్స్‌కు రక్షణ కల్పించే క్యాప్సైడ్ కవచాన్నిలెనకపవిర్ ఇంజక్షన్ టార్గెట్ చేస్తుంది. తాజాగా జరిపిన క్లినికల్ ట్రయల్స్‌లో 16-25 ఏళ్ల యువతులపై ట్రయల్స్ జరిపారు. వీరికి లెన్ ఎల్ఏ మందును ఆరు నెలలకోసారి రెండు సార్లు ఇచ్చారు. ఇంజక్షన్ పనితీరును ట్రువాడా, డెస్కోవీ ట్యాబ్లెట్లతో పోల్చి చూశారు. ఈ ఇంజక్షన్ తీసుకున్న 213 మంది మహిళల్లో ఒక్కరికి కూడా హెచ్ఐవీ సోకలేదని వెల్లడైంది.
అదే సమయంలో ట్రువాడా ట్యాబ్లెట్స్ వేసుకున్న వారిలో 1.5 శాతం మందికి, డెస్కోవా తీసుకున్నవారిలో 1.8 శాతం మంది హెచ్ఐవీ ఇన్‌ఫెక్షన్ బారినపడ్డారు. దాంతో లెనకపవిర్ ఇంజక్షన్ వినియోగంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ హెచ్ఐవీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది 13 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి.
Also read: Diabetes Early Signs: రాత్రి వేళ కన్పించే డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook