Testing Honey Purity | తెనె అనేది ఎవర్ గ్రీన్ ఫుడ్. దాంతో పాటు ఎక్స్పైర్ అవ్వని ఫుడ్. దీనిలో ఉన్న ఆరోగ్యగుణాలు, ఇందులో ఉండే పోషక తత్వాల వల్ల తేనెకు ఒక కిరీటం లాంటి టైటిల్ ఇచ్చేశారు. అదేంటంటే.. మరణాన్ని తప్పా అన్నింటికి సమాధానం తేనె అని.
Also Read | Health: జలుబు దగ్గును తగ్గించే 5 వంటింటి చిట్కాలు
మన ఇంట్లో వంటగదిలో సెలబ్రిటీ అయిన తేనె (Honey) నిఖార్సైందో.. లేక కల్తీ అయిందో తెలుసుకొని వాడటం చాలా ముఖ్యం. లేదంటే ఆరోగ్యం అటుంచితే కొత్త సమస్యలు రావచ్చు.
మీ ఇంట్లో ఉన్ తేనె మంచిదో కాదో.. ఇలా చెక్ చేయండి
థంబ్ టెస్ట్ | The Thumb test Of Honey
మీ బొటన వేలిపై కొంచెం తేనెను అప్లై చేసి..దాని వాసనను చెక్ చేయండి. వేరే లిక్విడ్‌లా వాసన వస్తోందో చెక్ చేయండి. వాసన వేరేలా ఉంటే అది మంచి తేనెకాదు. తేనె చిక్కగా ఉండాలి.
Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి
తెనెకు నీటి పరిక్ష | Water Test Of Honey
ఒక గ్లాసు నీటిలో చెంచాడు తేనె వేయండి. అది నీటిలో (Water) కలిస్తే అది నకిలి తేనె. ఒరిజినల్ తేనె అనేది చాలా చిక్కగా ఉంటుంది అని చెప్పాం కదా.. అందుకే అది గ్లాసు అడుగున అది చేరుకుంటుంది.
వినీగర్తో | Vinegar Test Of Honey
వినీగర్ వాటర్‌లో కొన్ని చుక్కల తేనె కలపండి. అందులో నురగవస్తోంటే అది నకిలీది అని అర్థం.
Also Read | Shirshasana : ప్రెగ్నెన్సీలో శీర్షాసనం మంచిదేనా? చదవండి!
అగ్ని పరిక్ష అంటే వేడి పరిక్ష |The Heat Test Of Honey
నిప్పునకు చెదలంటవు అంటారుగా.. అదే విధంగా తెనెకు నిప్పు అంటదు. ఈ టెస్టు చేయడానికి అగ్గిపుల్లను తేనెలో ముంచి అగ్గిపెట్టెతో వెలిగించడానికి ప్రయత్నించండి. వెలిగితె తేనె నకిలీ, వెలగకపోతే తెనె మంచిది అని ఫిక్స్ అవ్వండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe