CBSE Board Exams 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు 2021ను వాయిదా వేస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ ఆ వదంతులను నమ్మవద్దని, సీబీఎస్ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జనవరిలోనే ప్రారంభమవుతాయనే ఊహాగానాలు ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ విద్యా సంవత్సరం తరగతులు ఆలస్యంగా మొదలయ్యాయని తెలిసిందే. ఈ నేపథ్యంలో 10 వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు 2021 మార్చిలో జరుగుతాయని పలు నివేదికలు తెలిపాయి.
టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్, 12వ తరగతి పరీక్షలు 2021 తేదీలకు సంబంధించి అధికారిక ప్రకటన CBSE నుంచి వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ డిసెంబర్ 3న మధ్యాహ్నం 12 గంటలకు విద్యార్థులతో ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ కానున్నారు. మంత్రి జేఈఈ 2021, నీట్ 2021 సహా పలు బోర్డ్ ఎగ్జామ్స్ గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సీబీఎస్ఈ పదో తరగతి, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ 2021 తేదీలపై మంత్రి పోఖ్రియాల్ ప్రకటన చేస్తారని అంతా భావిస్తున్నారు.
UGC NET Results 2020: యూజీసీ నెట్ 2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి
వచ్చే ఏడాది నిర్వహించనున్న బోర్డు పరీక్షలను ఎలా, ఎప్పుడు నిర్వహించాలనే దానిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల అభిప్రాయాలను కోరతామన్నారు. ‘వచ్చే ఏడాది (2021) పరీక్షలను ఎలా, ఎప్పుడు నిర్వహించాలనే దానిపై విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి అభిప్రాయాలను తెలుసుకోవడానికి క్యాంపెయిన్ ప్రారంభిస్తామని’ విద్యాశాఖ మంత్రి ట్వీట్ చేశారు
Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!
మంత్రి టీఓఐతో తో మాట్లాడుతూ.. ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశానికి ముఖ్యమైన ఫలితాలు కనుక బోర్డ్ ఎగ్జామ్స్‌ను త్వరగానే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం పరీక్షలు నిర్వహించడం ఒక సవాల్ లాంటిది. కానీ విద్యార్థుల భవిష్యత్ కోసం తగిన ఏర్పాట్లు చేసి ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశానికి బోర్డు పరీక్షలతో పాటు ప్రవేశ పరీక్షలు నిర్వహించడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయలతో చర్చించాకే తుది నిర్ణయమన్నారు.
Fast Internet Tips: మీ మొబైల్ ఇంటర్నెట్ స్లో అయిందా.. ఈ టిప్స్ పాటించండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe