TRS MLA Nomula Narsimhaiah passes away: హైదరాబాద్: తెలంగాణ ( Telangana ) నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) (TRS MLA Nomula Narsimhaiah) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మంగళవారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోముల నర్సింహయ్యను కుటుంబసభ్యులు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్న క్రమంలోనే గుండెపోటు రావడంతో నోముల తుదిశ్వాస విడిచారు.
టీఆర్ఎస్ ( TRS ) ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (Nomula Narsimhaiah ) గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతోపాటు ఆయన నెలరోజుల క్రితం కరోనావైరస్ మహమ్మారి బారినపడ్డారు. అయితే చికిత్స అనంతరం కరోనా ( Coronavirus ) నెగెటివ్‌గా రిపోర్టు వచ్చింది. అయినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు. నోముల నర్సింహయ్య మృతితో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయన అభిమానాలు, నాగర్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాంత వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మొదట ఆయన సీపీఎం పార్టీలో క్రీయాశీలకంగా పనిచేశారు. 1999, 2004లో సీపీఎం నుంచి రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి నోముల నర్సింహయ్య ఓటమి పాలయ్యారు. అనంతరం 2013లో టీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జానారెడ్డిపై ఘన విజయం సాధించారు. నోముల నర్సింహయ్య మరణం పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
Also read | GHMC Elections: గ్రేటర్ పోలింగ్ ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Nomula Narsimhaiah: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల కన్నుమూత
తెలంగాణ (Telangana) నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
నోముల నర్సింహయ్య (Nomula Narsimhaiah ) నెలరోజుల క్రితం కరోనావైరస్ మహమ్మారి బారినపడ్డారు.