Spy Features Of WhatsApp: మీ ఫ్రెండ్స్‌కు తెలియకుండా వాట్సాప్‌ స్టేటస్‌ చూసేద్దామా?

Spy Features Of WhatsApp | ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్నవారు కచ్చిచతంగా ఇంటర్నెట్ వినియోగిస్తారు. మొబైల్ ఏదైనా నోటిఫికేషన్ సౌండ్ వచ్చినప్పుడు వాట్సాప్ మెస్సేజ్‌లు ఏమైనా వచ్చాయా అని చెక్ చేస్తుంటాం. సోషల్ మీడియాను ఏలుతున్న యాప్స్‌లలో వాట్సా్ప్ ఒకటి.

Last Updated : Nov 29, 2020, 05:29 PM IST
  • సోషల్ మీడియాను ఏలుతున్న యాప్‌లలో వాట్సాప్ ఒకటి
  • వాట్సాప్ టిక్ మార్క్స్‌కు ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంటుంది
  • వాట్సాప్ స్టేటస్ విషయంలో కొందరు గోప్యత వహిస్తారు
Spy Features Of WhatsApp: మీ ఫ్రెండ్స్‌కు తెలియకుండా వాట్సాప్‌ స్టేటస్‌ చూసేద్దామా?

సోషల్ మీడియాను ఏలుతున్న యాప్స్‌లలో వాట్సా్ప్ ఒకటి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్నవారు కచ్చిచతంగా ఇంటర్నెట్ వినియోగిస్తారు. మొబైల్ ఏదైనా నోటిఫికేషన్ సౌండ్ వచ్చినప్పుడు వాట్సాప్ మెస్సేజ్‌లు ఏమైనా వచ్చాయా అని చెక్ చేస్తుంటాం. అయితే ఈ మధ్య ఎక్కువగా వాట్సాప్ స్టేటస్ మీద ఫోకస్ చేస్తున్నారు. సాధారణంగా మెస్సేజ్‌లకు అయితే ఎవరైనా మీ మెస్సేజ్ చదివితే మీకు రెండు బ్లూ టిక్ మార్క్స్ కనిపిస్తాయి.

అయితే వాట్సాప్ స్టేటస్ (WhatsApp Status) విషయంలో కొందరు జాగ్రత్త పడుతుంటారు. మీరు మీ వాట్సాప్ ఫ్రెండ్స్, కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారి స్టేటస్‌ చూసినా వారు ఈ విషయం తెలుసుకోకుండా చేయవచ్చు. అంటే మీ వాట్సాప్ (WhatsApp) మిత్రుడికి మీరు వారి స్టేటస్ చూశారా లేదా అనేది తెలియకుండా.. మీరు ఎంచక్కా ఇతరుల వాట్సాప్ స్టేటస్ చూసే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. 

Also Read : Best Recharge Plans: బెస్ట్ అన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్స్.. వివరాలు ఇవే

సాధారణంగా మీరు అప్‌లోడ్ చేసిన వాట్సాప్ స్టేటస్ 24 గంటలపాటు అలాగే ఉంటుంది. అంతలోపే మీరు డిలీట్ కూడా చేయవచ్చు. అయితే మీరు ఇతరుల వాట్సాప్ చూసినా.. వారు ఇది కనిపెట్టకుండా ఉండాలంటే ఈ చిన్న విషయం పాటిస్తే సరి. వాట్సాప్ ఓపెన్ చేయగానే కుడివైపు పై భాగంలో మూడు చుక్కలు కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేయాలి. ఆ తర్వాత వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో ప్రైవసీ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మనం రీడ్‌ రిసిప్ట్‌ ఆప్షన్‌ను ఆఫ్‌ చేసుకుంటే సరి. 

Also Read : Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News