వారం రోజులుగా దీక్ష చేస్తున్న డాక్టర్ సుశీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రధాని మోదీ భార్య జశోదాబెన్‌కి మద్దతు ఇస్తూ ఆమె కోసం దీక్ష చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జశోదాబెన్‌ను భార్యగా అంగీకరించాలని, లేకుంటే ఆమెకు ఇచ్చిన జెడ్ క్యాటగిరి భద్రతా తొలగించి ఆమెకు స్వేచ్ఛనివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా తర ఇంట్లో గత వారం రోజులుగా దీక్ష చేస్తూ.. బాగా నీరసించిన డాక్టర్ సుశీలను పోలీసులు అదుపులోకి తీసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిష్కారం లభించేదాకా తాను దీక్ష విరమించనని.. ఆసుపత్రిలోనైనా కొనసాగిస్తానని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఇది కూడా చదవండి: ప్రధాని మోడీ భార్య కోసం హైదరాబాద్‌లో నిరాహార దీక్ష
దీక్ష భగ్నం అనంతరం సుశీల సోషల్ మీడియాలో మాట్లాడుతూ మోదీపై వ్యాఖ్యలు చేశారు. జశోదాబెన్‌ను భారతనారిగా, మోదీని బ్రిటీష్ అధికారిగా పోల్చి.. ఇద్దరిలో ఎవరి పక్షాన నిలబడతారంటే.. నేను జశోదావైపే నిలబడతానని చెప్పారు. కాగా సుశీల వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు పెదవి విరిచారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నది కనుకే ఆమెకు జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తున్నారని కామెంట్స్ చేశారు. మోదీ బాల్యంలో జశోదాబెన్‌ను వివాహం చేసుకొని.. తరువాత ఆమెకు దూరంగా ఉన్నారు. ఆయన వైవాహిక జీవితంపై బీజేపీ కొన్ని ప్రకటనలు చేసిన విషయం విదితమే..!