Greater Elections 2020 | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు డిసెంబర్ 1వ తేదీన జగనున్నాయి అనే విషయం తెలిసిందే. ఈ మేరకు నామినేషన్ ప్రక్రియ షురూ అయింది. నవంబర్ 18,19,20 తేదీల్లో నామినేషన్ ఉంటుంది అని.. 21 నామినేషన్ల పరిశీలన ఉంటుంది అని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
Also Read | Free BSNL Sim: సిమ్ కార్డును ఉచితంగా ఇవ్వనున్న బిఎస్ఎన్ఎల్
ఈ మేరకు నామినేషన్ల కోసం పార్టీలు సిద్ధం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (TRS ) , సీపీఎమ్ నేడు అభ్యర్థులు జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్ ప్రక్రియ కొనసాగింపులో భాగంగా మొత్తం 150 రిటర్నింగ్ ఆఫీసుల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే కార్యాలయంలోకి ప్రవేశించే అవకాశం కల్పించారు.
Also Read | Does Snake Drink Milk: పాములు పాలు తాగుతాయా? 5 అపోహలు, 5 వాస్తవాలు!
మరోవైపు ఎన్నికల నియమవళిలో అమలులోకి రావడంతో మున్సిపల్ సిబ్బంది వివిధ పార్టీలకు చెందిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ప్రత్యేకంగా 20 టీమ్స్ ఏర్పాటు చేసింది మున్సిపల్ కార్పోరేషన్ ( GHMC ). ఈ టీమ్స్ 24 గంటల్లోనే సుమారు 4వేల ఫ్లెన్సీలను తొలగించింది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR