Baba ka Dhaba donation controversy: యూట్యూబర్‌‌పై చీటింగ్‌ కేసు

కరోనావైరస్ (Coronavirus) కారణంగా తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని, గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నామంటూ.. ఢిల్లీలో ఇటీవల బాబా కా దాబా పేరిట చిన్న హోటల్ ( Baba ka Dhaba ) నడుపుతున్న వృద్ధ దంపతులు కన్నీళ్లు ( Old age couple broke down ) పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖుల నుంచి వచ్చిన విరాళాలను (donations) యూట్యూబర్ గౌరవ్ వాసన్ (YouTuber Gaurav Wasan)  కాజేశాడని ‘బాబా కా దాబా’ హోటల్‌ నడుపుతున్న 80ఏళ్ల కాంతా ప్రసాద్‌ (Kanta Prasad ) ఢిల్లీ పోలీసులకు (Delhi Police) ఫిర్యాదు చేశారు. 

Last Updated : Nov 7, 2020, 10:59 AM IST
Baba ka Dhaba donation controversy: యూట్యూబర్‌‌పై చీటింగ్‌ కేసు

Baba ka Dhaba donation controversy: న్యూఢిల్లీ: కరోనావైరస్ (Coronavirus) కారణంగా తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని, గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నామంటూ.. ఢిల్లీలో ఇటీవల బాబా కా దాబా పేరిట చిన్న హోటల్ ( Baba ka Dhaba ) నడుపుతున్న వృద్ధ దంపతులు కన్నీళ్లు ( Old age couple broke down ) పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రముఖుల దగ్గరి నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ ఆ వృద్ధ దంపతులకు సాయం అందించారు. అయితే అలా వచ్చిన విరాళాలను (donations) యూట్యూబర్ గౌరవ్ వాసన్ (YouTuber Gaurav Wasan)  కాజేశాడని ‘బాబా కా దాబా’ హోటల్‌ నడుపుతున్న 80ఏళ్ల కాంతా ప్రసాద్‌ (Kanta Prasad ) అక్టోబరు 31న సౌత్ పోలీసులకు (Delhi Police) ఫిర్యాదు చేశారు. Also read: Baba ka Dhaba viral video: గిరాకీ లేదని కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధ దంపతులు.. వీడియో వైరల్

అయితే కాంతా ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు యూట్యూబర్ గౌరవ్‌పై చీటింగ్ కేసు (సెక్షన్ 420) నమోదు చేసి అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద వాసన్‌పై కేసు నమోదు చేసి.. బాబా కా దాబాకు వచ్చిన విరాళాలపై పూర్తి విచారణ చేపడుతున్నట్లు సౌత్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అతుల్ కుమార్ పీటీఐకు తెలిపారు. 

దక్షిణ ఢిల్లీలోని మాల్వియానగర్‌లో ‘బాబా కా దాబా’ హోటల్‌ నడుపుతున్న వృద్ధ దంపతులు కరోనా లాక్‌డౌన్ వల్ల వారు పడుతున్న ఇబ్బందులను ఇటీవల వాసన్‌ తన యూ-ట్యూబ్‌ చానెల్‌ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చాడు. అయితే ఆ తర్వాత బాబా కా దాబాకు మంచి గుర్తింపు రావడంతోపాటు.. కాంతా ప్రసాద్‌కు భారీగా విరాళాలు వచ్చాయి. అయితే తన పేరిట దాతల నుంచి సేకరించిన విరాళాల్లో అధిక భాగం ఆయనే కాజేశాడని కాంతా ప్రసాద్‌ పోలీసులకు తెలియజేశారు. ఇదిలాఉంటే.. బాబా కా ధాబా యజమాని తనపై చేసిన ఆరోపణలను వాసన్ ఖండించారు.  Also read: Bihar Assembly Election 2020: బీహార్ తుది దశ పోలింగ్ ప్రారంభం

 

Also read: Kajal, Gautam latest pics: న్యూ ఫొటోషూట్‌లో తళుక్కుమన్న కొత్త జంట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News