Telangana Covid-19: కొత్తగా 1,539 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే రాష్ట్రంలో మూడు రోజుల నుంచి మళ్లీ 1500లకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతూనే ఉంది.

Last Updated : Nov 5, 2020, 09:25 AM IST
Telangana Covid-19: కొత్తగా 1,539 కరోనా కేసులు

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే రాష్ట్రంలో మూడు రోజుల నుంచి మళ్లీ 1500లకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 91.85 శాతం ఉండగా.. మరణాల రేటు 0.55 శాతం ఉంది. అయితే గత 24 గంటల్లో బుధవారం ( నవంబరు 4 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,539 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఐదుగురు (5) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,45,682 కి చేరగా.. మరణాల సంఖ్య 1,362 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Shivraj Singh Chouhan: మత మార్పిడికి వ్యతిరేకంగా ఎంపీలో చట్టం

అయితే గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 978 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,25,664 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 18,656 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. Also read: TRS: ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్.. స్థలం అప్పగింత

ఇదిలావుంటే.. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా 44,327 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 4వ తేదీ వరకు మొత్తం 43,94,330 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  జీహెచ్ఎంసీ పరిధిలో 285 కేసులు నమోదయ్యాయి. అయితే.. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

telangana corona cases bulletin

Also read: TRP scam: టెలివిజన్ రేటింగ్స్‌పై కమిటీ ఏర్పాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News