Telangana Police Recruitment: 20వేల మంది పోలీసు ఉద్యోగాల నియామకం

త్వరలో 20 వేల మంది పోలీసు సిబ్బంది నియామకం చేపట్టనున్నట్టు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ( Mahmood Ali ) ప్రకటించారు. 

Last Updated : Oct 23, 2020, 11:38 PM IST
    • త్వరలో 20 వేల మంది పోలీసు సిబ్బంది నియామకం చేపట్టనున్నట్టు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు.
    • ఈ మేరకు త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
    • కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి సమయంలో పోలీసు సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు.
Telangana Police Recruitment: 20వేల మంది పోలీసు ఉద్యోగాల నియామకం

త్వరలో 20 వేల మంది పోలీసు సిబ్బంది నియామకం చేపట్టనున్నట్టు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ( Mahmood Ali ) ప్రకటించారు. ఈ మేరకు త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి సమయంలో పోలీసు సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు. అదే సమయంలో పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతీ ఒక్కరినీ గౌరవించాలి అని కోరారు.

Read Also| NEET Results 2020: ఆరు మార్కులు వచ్చాయని... విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణ ( Telangana ) పోలీసులు అకాడమీ లో ఇవాళ జరిగిన పోలీసు సిబ్బంది పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుమారు 1,162 మంది పోలీసు సిబ్బంది పోలీసు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి ప్రభుత్వం పోలీసు ఎకాడమీలో 1,25,848 మందికి శిక్షణ అందించింది అని.. మొత్తం 18,428 మంది ఎస్సై, కానిస్టేబుల్స్ నియామకం చేసింది అని తెలిపారు. శాంతి భద్రతలు సంరక్షించడం అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తలిపారు.

Read Also | Rashmi Gautam: యాంకర్ రష్మీ కి కరోనా..

ఈ సందర్భంగా డీజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు సిబ్బంది నిజాయితీగా పని చేయాలి అని, అంకిత భావంతో బాధ్యతలు నిర్వర్తిస్తూ టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకోవాలి అని కోరారు. సమాజంలో నేరాలను రూపుమాపాలి అని రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేయాలి అని కోరారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News