Special Trains: ప్రయాణికుల కోసం ఆరు ప్రత్యేక ట్రైన్లు

రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ) నిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే కోవలో కొత్తగా ఆరు ప్రత్యేక ట్రైన్లను ప్రకటించింది రైల్వే. భారతీయ రైల్వే త్వరలో వెస్టర్న్ రైల్వేస్ నుంచి కొన్ని ప్రత్యేక ట్రైన్లను ( Special Trains ) ప్రారంభించనుంది.

Last Updated : Oct 4, 2020, 03:36 PM IST
    • రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ నిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది.
    • అదే కోవలో కొత్తగా ఆరు ప్రత్యేక ట్రైన్లను ప్రకటించింది రైల్వే.
    • భారతీయ రైల్వే త్వరలో వెస్టర్న్ రైల్వేస్ నుంచి కొన్ని ప్రత్యేక ట్రైన్లను ప్రారంభించనుంది.
Special Trains: ప్రయాణికుల కోసం ఆరు ప్రత్యేక ట్రైన్లు

రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ) నిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే కోవలో కొత్తగా ఆరు ప్రత్యేక ట్రైన్లను ప్రకటించింది రైల్వే. భారతీయ రైల్వే త్వరలో వెస్టర్న్ రైల్వేస్ నుంచి కొన్ని ప్రత్యేక ట్రైన్లను ( Special Trains ) ప్రారంభించనుంది.

ALSO READ|  IPL 2020: ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే

ఈ ట్రైన్లు బాంద్రా టెర్మినల్ నుంచి ఝాన్సీ, కాన్పూర్ సెంట్రల్, అహ్మదాబాద్ నుంచి ఆగ్రా కేంట్, గ్వాలియర్, రత్మాల్, భిండ్ మధ్యలో కొనసాగుతాయి. ఈ ప్రత్యేక ట్రైన్ల నెంబర్లు 01104, 011025 గా నిర్ణయించారు. ఈ ట్రైన్లు అక్టోబర్ 3 నుంచి ప్రయాణం మొదలు పెట్టాయి. అదే సమయంలో 02244 నెంబర్ ట్రైన్ ఇవాళ ప్రారంభం కానుంది. 

బాంద్రా నుంచి ఝాన్సీ
బాంద్రా నుంచి ఝాన్సీ వరకు నడిచే ఈ ట్రైన్ నెంబర్ 01103. ఇది కూడా నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ వారంలో రెండు రోజులు నడవనుంది.

బాంద్రా నుంచి కాన్పూర్
బాంద్రా ( Bandra ) టెర్మినెస్ నుంచి కాన్పూర్ మధ్య 02244, 02243 నెంబర్ ట్రైన్ వారానికి రెండు సార్లు నడుస్తుంది. ఈ బండి అక్టోబర్ 7 న బాంద్రా నుంచి ప్రారంభం కానుంది.

ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి

అహ్మదాబాద్ నుంచి ఆగ్రా 
అహ్మదాబాద్ నుంచి ఆగ్రా మధ్యలో వారంలో నాలుగు సార్లు నడుస్తుంది. అహ్మదాబాద్ నుంచి అగ్రా కెంట్ వరకు నడించే ఈ ట్రైన్ నెంబర్ 02548.

అహ్మదాబాద్ నుంచి గ్వాలియర్
అదే సమయంలో అహ్మదాబాద్ నుంచి గ్వాలియర్ కు వెళ్లే ట్రైన్ వారానికి మూడు రోజులు నడుస్తుంది. అదే సమయంలో రత్మాల్ నుంచి గ్వాలియర్ వరకు నడిచే 01125 ట్రైన్ నేటి నుంచి ప్రారంభ కానుంది. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News