ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) 37 పరుగుల తేడాతో విజయం సాదించడం తెలిసిందే. దుబాయ్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప (Robin Uthappa) చేసిన చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిబంధనల్ని రాబిన్ ఉతప్ప ఉల్లంఘించాడు. కోవిడ్19 నేపథ్యంలో ఐసీసీ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. ఉమ్మి (లాలాజలాన్ని) బంతి మెరుపు వచ్చేందుకు రుద్దకూడదు. కానీ కేకేఆర్‌తో మ్యాచ్‌లో మూడో ఓవర్లో ఫీల్డింగ్ చేస్తున్న రాబిన్ ఉతప్ప చేతికి బంతి దొరకగా ఉమ్మిని రద్దేశాడు.
Also Read : Robin Uthappa: విరాట్ కోహ్లీ చెత్త రికార్డును అధిగమించిన రాబిన్ ఉతప్ప
సునీల్ నరైన్ ఆడిన లాఫ్టెడ్ షాట్ ఆడిన బంతిని వదిలేసి క్యాచ్ డ్రాప్ చేశాడు ఉతప్ప. ఈ క్రమంలో బౌలర్‌కు అందించక ముందు బంతిని తీసుకుని ఉమ్మి అంటించి రద్దే సరికి టీవీలో ఐపీఎల్ చూస్తున్న ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఎవరైనా ఆటగాడు ఇలా ఉమ్మి (Saliva)ను బంతికి రుద్దితే రెండు పర్యాయాలు వార్నింగ్ ఇస్తారు ఆ తర్వాత బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు పెనాల్టీగా ఇస్తారు. ఉమ్మిని బంతికి పదే పదే రుద్దిన ఆటగాడిపైనా చర్యలు తీసుకోనున్నారు.
— Cow Corner (@CowCorner9) September 30, 2020
కాగా, రెగ్యూలర్ అలవాటు వల్ల అలా చేసి ఉంటాడని కొందరు అభిప్రాయపడగా.. ఉతప్ప ఇలాంటివి వద్దప్పా అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. దీని వల్ల కరోనా లాంటివి సోకే అవకాశం ఉందని, ఒక్క ఆటగాడు చేసే పొరపాటుతో ఐపీఎల్ రద్దయ్యే అవకాశం తలెత్తుతుందని ట్రోల్ చేస్తున్నారు.
కాగా, దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైన రాజస్థాన్ లీగ్‌లో తొలి ఓటమిని రుచి చూసింది. ఈ క్రమంలో రాజస్థాన్ ఆటగాడు, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరిట ఉన్న చెత్త రికార్డును అధిగమిస్తూ ఆ రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం.
మరిన్ని కథనాలు మీకోసం
- Bank Holidays in October 2020: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..
- Health Tips: ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తున్నారా.. ఈ సమస్యలు తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe