కివీ ( Kiwi ) రుచి ఢిపరెంట్ గా ఉండటమే కాదు.. దాని వల్ల ఆరోగ్యానికి ( Health ) ఎన్నో కలుగుతాయి. ఈ పండులో విటమిన్ సీ,కే, ఈ, ఫోలేట్, పొటాషియం అధికంగా ఉంటాయి. దీంతో పాటు కివీలో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కివీలో ఉండే నలుపు రంగు విత్తనాలు, దాని చర్మం కూడా తినదగినదే.
ఇలా కివీ వల్ల కలిగే లాభాలివే...
ALSO READ| Dry Cough: ఈ మూడు చిట్కాలు పాటిస్తే పొడిదగ్గు ఇట్టే తగ్గిపోతుంది
ఆస్తమా పేషెంట్స్ కు..
విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఆస్తమా ఉన్న పేషెంట్స్ కు ఇది చాలా మంచిది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే పిల్లలకు తాజా కివీని తినిపిస్తే మార్పు కనిపిస్తుంది.
జీర్ణక్రియ
కివీ పండులో చాలా ఫైబర్ ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.
ఇమ్యూనిటీని బలపరుస్తుంది
కివీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ ( Immunity ) పెరుగుతుంది. ఇందులో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. సగం కివీ పండు తిన్నా.. మన శరీరానికి కావాల్సిన విటమిన్ సీ లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపకరిస్తుంది.
ALSO READ| Weight Loss: ఉదయం లేవగానే ఈ డ్రింక్ తీసుకోండి.. బరువు తగ్గండి
అర్థిరైటిస్
ఆర్థిరైటిస్ సమస్య ఉన్న వాళ్లు తరచూ కివీ తీసుకోవడం వల్ల లాభాలు కలుగుతాయి.
కొలెస్ట్రాల్ లెవల్ ను తగ్గిస్తుంది
కొలెస్ట్రాల్ ను ( Cholesterol ) అదుపుచేయడంలో కివీ ఫ్రూట్ ఉపయోగకరంగా ఉంటుంది. కివీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులకు ఇది చాలా మంచిది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR