Celebrities phones seized by NCB in Bollywood drug case: ముంబై: బాలీవుడ్ యువనటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య నాటినుంచి బాలీవుడ్లో ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ముందు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్టయిన తర్వాత డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణులు, పలువురు సినీ ప్రముఖల పేర్లు బయటకువచ్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి అనుమానితులకు నోటీసులు జారీ చేయడంతోపాటు విచారణ, అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఈ కేసులో ఎన్సీబీ కార్యాలయానికి టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ హాజరైన సంగతి తెలిసిందే. డ్రగ్ చాట్ చేశాను కానీ.. డ్రగ్స్ తీసుకోలేదంటూ రకుల్ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. ఇదిలాఉంటే.. డ్రగ్స్ కేసులో శనివారం దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, కరిష్మా ప్రకాశ్ ఎన్సీబీ కార్యాలయానికి హాజరై.. వాంగ్మూలాలను ఇచ్చారు. అయితే ఎన్సీబీ అధికారుల విచారణలో దీపిక, సారా, శ్రద్ధాతోపాటు హాజరైన పలువురు కూడా బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం గురించి కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. Also read: Jaswant Singh Dies: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత
ఇదిలాఉంటే.. విచారణ అనంతరం దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, కరిష్మా ప్రకాష్, రకుల్ ప్రీత్ సింగ్, సిమోన్ ఖంబట్టా, జయ షా మొబైల్ ఫోన్లు స్వాధీనం (Celebrities phones seized) చేసుకున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి ఆదివారం వెల్లడించారు. అయితే వాటిని తదుపరి విచారణ కోసం ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నారు. వారి వాంగ్మూలాల ప్రకారం ఇంకా విచారణ కొనసాగనుంది. అయితే (Drugs case) ఈ వ్యవహారంలో ఇంకా కీలక నటుల పేర్లు బయటపడవచ్చని పలువురు పేర్కొంటున్నారు.
అంతేకాకుండా శనివారం ధర్మ ప్రొడక్షన్స్‌కు చెందిన క్షితిజ్ ప్రసాద్‌ను ఎన్సీబీ పలు కోణాల్లో ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేసింది. దీంతోపాటు డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 18కి చేరింది. SPB News: వెంటాటి వెంటాడి వేధించి తీసుకెళ్లిపోయింది: గాయని సుశీల ఆవేదన