కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ( Central Water resources minister ) గజేంద్రసింగ్ శెఖావత్ ( Gajendrasingh shekhawat ) త్వరలో ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పర్యటనకు రానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Ap cm ys jaganmohan reddy ) ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం జగన్..ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ ను కలిశారు. ఈ సందర్బంగా పోలవరం ( Polavaram project ) సహా పలు ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ముఖ్యంగా నదుల అనుసంధానంపై చర్చించారు. నదుల అనుసంధానానికి సంబంధించి రాష్ట్ర పర్యటన చేపట్టాలంటూ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ శ్రీరామ్ కు కేంద్ర మంత్రి సూచించారు.
ఇక రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఉన్న పోలవరంకు నిధులు విడుదల చేయాల్సిందిగా సీఎం జగన్..కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు అందించాలని కోరారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు పర్యటనకు రావాలని సీఎం జగన్ కోరడంతో..కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకున వచ్చే యేడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ప్రణాళికను రూపొందించే అంశంపై చర్చ సాగింది.
మరోవైపు నిన్న కేంద్ర హోంమంత్రిని కలిసిన జగన్..పలు అంశాలపై అమిత్ షా ( Central Home minister Amit shah ) తో చర్చించారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టాని ( Ap Reorganisation act ) కి అనుగుణంగా రాష్ట్రానికి అందాల్సిన సహాయం, దిశ చట్టం, శాసన మండలి రద్దు వంటివాటిపై ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ కోరారు. Also read: Swarna palace case: విచారణకు హాజరవమంటూ డాక్టర్ రమేష్ కు నోటీసులు జారీ
AP: పోలవరం ప్రాజెక్టు పర్యటనకు రానున్న కేంద్ర జల వనరుల శాఖ మంత్రి