బ్రిటీష్ కౌన్సిల్‌తో ఏపీ విద్యాశాఖ ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు వారికి బోధన సేవలు అందిస్తున్న ప్రైవేటు సంస్థల ఉపాధ్యాయులు కూడా ఆంగ్లభాషపై పూర్తిస్థాయి పట్టు సాధించేందుకు ఏపీ ప్రభుత్వం, బ్రిటీష్ కౌన్సిల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

Last Updated : Dec 21, 2017, 08:15 PM IST
బ్రిటీష్ కౌన్సిల్‌తో ఏపీ విద్యాశాఖ ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు వారికి బోధన సేవలు అందిస్తున్న ప్రైవేటు సంస్థల ఉపాధ్యాయులు కూడా ఆంగ్లభాషపై పూర్తిస్థాయి పట్టు సాధించేందుకు ఏపీ ప్రభుత్వం, బ్రిటీష్ కౌన్సిల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

ముఖ్యంగా నేడు భారతదేశంలో ఉపాధి కల్పనకు పెద్దపీట వేయడానికి, నిరుద్యోగులు మంచి భావప్రసార నైపుణ్యాలను ఆంగ్లంలో పెంపొందించుకోవడానికి, బ్రిటిష్ కౌన్సిల్ మన రాష్ట్ర ఉన్నతవిద్యా మండలి సంయుక్తంగా నిర్వహించే శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతోంది ప్రభుత్వం.

ఇంగ్లండ్‌తో పాటు ఇతర దేశాలకు మధ్య పరస్పర లాభదాయక రీతిలో సాంస్కృతి, విద్యా సంబంధాలను పెంపొందించడం,  సృజనాత్మక ఆలోచనలను, సాఫల్యాలను ప్రోత్సహించడం బ్రిటీష్ కౌన్సిల్ లక్ష్యం. బ్రిటిష్‌ కౌన్సిల్‌కు ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు, ప్రాంతాల్లో విస్తరించిన నెట్‌వర్క్‌ ఉంది. 

Trending News