COVID-19 Vaccine: అమెరికా ప్రజలకు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలోో డొనాల్డ్ ట్రంప ్ తన శాయశక్తులా పనిచేస్తున్నారు. తన మాటలను ఓట్లుగా మలుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలోనే అమెరికా పౌరులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని (COVID-19 vaccine to Americans free of Charge) ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.

Last Updated : Sep 17, 2020, 09:25 AM IST
COVID-19 Vaccine: అమెరికా ప్రజలకు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమయం దగ్గర పడుతున్నకొద్దీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలివిగా పావులు కదుపుతున్నారు. దేశ పౌరులందరికీ ఉచితంగా కోవిడ్19 వ్యాక్సిన్ (COVID-19 Vaccine) అందజేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా ఆరోగ్యశాఖ, రక్షణశాఖలు బుధవారం ఇందుకు సంబంధించి డాక్యుమెంట్ విడుదల చేశాయి. కరోనా రహిత అమెరికాను చేయడంలో భాగంగా తమ దేశ పౌరులకు  కరోనా వ్యాక్సిన్  (CoronaVirus Vaccine) ఉచితంగానే పంపిణీ (COVID-19 vaccine to Americans free of Charge) చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. Oxford COVID-19 Vaccine: క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి

అమెరికాలో ఈ నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌‌ను సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. ‘స్థానిక, స్టేట్ హెల్త్ కేర్ అధికారులతో కలిపి పని చేస్తున్నాం. కరోనా వ్యాక్సిన్ తయారుకాగానే, దేశ పౌరులకు పంపిణీ మొదలుపెట్టేందుకు సిద్దమని’ హెచ్‌హెచ్ఎస్ సెక్రటరీ అలెక్స్ అజర్ బుధవారం పేర్కొన్నారు. Tollywood: నటుడు అల్లు అర్జున్‌పై ఫిర్యాదు

కరోనా వ్యాక్సిన్‌ను కేవలం సైన్స్, టెక్నాలజీతో పూర్తి అవగాహనతోనే రూపొందిస్తున్నామని ప్రజలు గుర్తించాలని ట్రంప్ ప్రభుత్వం కోరుతోంది. తొలుత ఆరోగ్యానికి సంబంధిచిన శాఖలలో పనిచేసే వారికి, సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. అక్టోబర్ చివరికల్లా కోవిడ్19 వ్యాక్సిన్‌ను రూపొందించి, నవంబర్ నుంచి పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ఉన్నతాధికారులకు ఇటీవల ఆదేశాలు జారీ కావడం తెలిసిందే. Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు

ప్రపంచంలో అధిక కరోనా కేసులు 6,616,458 (6.6 మిలియన్లు), 1,96,436 కరోనా మరణాలతో అమెరికాలో కరోనా మహమ్మారి అలజడిని కొనసాగిస్తోంది. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కరోనా సమస్య అధ్యక్షుడు ట్రంప్‌ను కవలవరపెడుతున్నట్లు తెలుస్తోంది.  Bigg Boss 4 Voting Numbers: మీ ఫెవరెట్ కంటెస్టెంట్స్‌ ఓటింగ్ నెంబర్స్ ఇవే...  

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News