హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న తెలుగు మహాసభల ముగింపు వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. కాగా, ఈ ముగింపు వేడుకల్లో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఆయన్ను వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా.. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.
#PresidentKovind arrives in Hyderabad on his first visit to Telangana as President of India pic.twitter.com/Xh0Q1dPMpS
— President of India (@rashtrapatibhvn) December 19, 2017
అనంతరం వేదికపైకి చేరుకున్నరాష్ట్రపతి.. సోదర సోదరీమణులారా! అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. దాంతో ఒక్కసారిగా సభలో ఉన్న భాషాభిమానులు కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టారు. దేశంలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగు ఒకటి అన్నారు. దేశ భాషలందు తెలుగులెస్స అన్నారు. తెలంగాణలో ఇటువంటి సభలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంలోని హైలెట్స్:
* కృష్ణదేవరాయల కాలం నుండి వస్తున్న తెలుగుభాషకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
* తెలుగు కవులు, కవయిత్రిలకు వందనాలు.. త్యాగయ్య, వంటికోట ఆళ్వారు స్వామి, రామదాసు, అన్నమయ్య లాంటి మహానుభావులకు వందనాలు.
* హక్కుల కోసం పోరాడిన కొమరంభీం పుట్టిన నేల ఇది.
* రాష్ట్రపతిగా ముగ్గురు (సర్వేపల్లి, వివి గిరి, నీలం సంజీవ రెడ్డి), ఇప్పడు ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు కూడా తెలుగువారు.
* పీవీ నరసింహా రావు బహుముఖ ప్రజ్ఞాశాలి.
* స్వాతంత్య్ర ఉద్యమంలో తెలుగువారి త్యాగాలు మరువలేనివి.
* హైదరాబాద్ అనేక సంస్కృతులకు కేంద్రం. హైదరాబాద్ బిర్యానీకి, బ్యాడ్మింటన్ కి, బాహుబలికి ప్రసిద్ధి.