Rajasthan Royals new jersey: న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2020) ప్రారంభానికి సమయం దగ్గరపడింది. ఎలాగైనా.. కప్‌ను సాధించాలన్న కసితో జట్లు అన్నీ తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాయి. ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యుఏఈలోని మూడు వేదికలు.. అబుదాబి, షార్జా, దుబాయ్‌లల్లో జరగనుంది. ఈ క్రమంలో ఐపీల్ 13వ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కొత్త జెర్సీని అట్టహాసంగా సరికొత్తగా ఆవిష్కరించింది. యూఏఈలోని ఒక బీచ్ ఫ్రాంఛైజీ రెడ్‌బుల్ స్కైడైవింగ్, వింగ్‌సూట్ అథ్లెట్ డానీ రోమన్ విన్యాసాలతో వినూత్నంగా జెర్సీని విడుదల చేసింది.
Official matchday jersey for #IPL2020 has literally 𝐋𝐀𝐍𝐃𝐄𝐃🔥 @redbullindia | #HallaBol | #RoyalsFamilypic.twitter.com/oCyJasIWV2
— Rajasthan Royals (@rajasthanroyals) September 9, 2020
విమానం నుంచి దూకి స్కైడైవింగ్ చేస్తూ రాయల్ మిరాజ్ రిసార్ట్ వద్ద ల్యాండ్ అయిన రోమన్.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లకు నూతన జెర్సీలను అందజేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రాంఛైజీ ట్విటర్లో షేర్ చేసింది. అయితే 2018లో ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్-13వ సీజన్‌లో తొలిమ్యాచ్‌ను 22వ తేదీన షార్జాలో చెన్నైసూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. Also read: IPL 2020 Schedule: ఐపిఎల్ షెడ్యూల్ విడుదల.. మీ ఫెవరిట్ టీమ్ మ్యాచులు చెక్ చేయండి