/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. సిబ్బందితో పాటు ఆటగాళ్లకు కలిపి మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆసీస్ పేసర్ జోష్ హేజల్‌వుడ్ (Josh Hazlewood) ఆందోళన చెందుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌‌ గడ్డపై ఆ జట్టుతో సిరీస్ ఆడుతున్నాడు. ఇది ముగిసిన వెంటనే ఐపీఎల్ 2020 (IPL 2020) ఆడేందుకు యూఏఈకి వచ్చి చెన్నై జట్టుతో హేజల్‌వుడ్ చేరనున్నాడు.

ప్రస్తుతం తాను ఇంగ్లాండ్ పర్యటనలో బిజీగా ఉన్నానని, దాని తర్వాతే ఐపీఎల్ గురించి ఆలోచిస్తానని, కానీ కరోనా కేసులుంటే చాలా కష్టమని సీఎస్కే స్టార్ పేసర్ చెబుతున్నాడు. వాట్సాప్ గ్రూపులో జట్టుతో అందుబాటులో ఉన్నానని తెలిపాడు. సీఎస్కే జట్టు క్వారంటైన్‌లో ఉన్నారు. ఐపీఎల్ ప్రారంభానికి దగ్గర పడితే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హేజల్‌వుడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

కాగా, జట్టులోనూ వాతావరణం సరిగా ఉన్నట్లు కనిపించడం లేదు. కరోనా కేసులు రావడంతో వ్యక్తిగత కారణాలని పేర్కొంటూ స్టార్ క్రికెటర్ సురేష్ రైనా స్వదేశానికి తిరిగొచ్చేశాడు. ప్రతి ఆటగాడు సమానమేనని, రైనా తమకు ఎక్కువ కాదంటూ చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ కామెంట్ చేయడంతో జట్టులో వివాదాలున్నాయని తెలుస్తోంది.

Section: 
English Title: 
IPL 2020: Josh Hazlewood concerned by coronavirus cases at Chennai Super Kings
News Source: 
Home Title: 

CSK ఆటగాళ్లను వెంటాడుతోన్న కరోనా భయం

CSK ఆటగాళ్లను వెంటాడుతోన్న కరోనా భయం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

చెన్నై ఆటగాళ్లను వెంటాడుతోన్న కరోనా వైరస్ భయం

జట్టు సిబ్బంది, ఆటగాళ్లు సహా మొత్తం 13 మందికి కోవిడ్ పాజిటివ్

త్వరలో జట్టుతో చేరనున్న సీఎస్కే పేసర్ జోష్ హేజల్‌వుడ్

కరోనా ఉంటే కష్టమే అంటోన్న ఆస్ట్రేలియా స్టార్ బౌలర్

Mobile Title: 
CSK ఆటగాళ్లను వెంటాడుతోన్న కరోనా భయం
Publish Later: 
No
Publish At: 
Tuesday, September 1, 2020 - 12:44