తెలుగు హీరోలు సినిమాల్లో డిష్యూం డిష్యూం చేయడమే కాదు.. కిచెన్ లో డిష్ లు ప్రిపేర్ చేయడంలో కూడా హీరోలే. లాక్ డౌన్ సమయంలో మోహన్ బాబు, రామ్ చరణ్, చిరంజీవి ( Chiranjeevi ) వంటి తారలు కిచెన్ లో ప్రయోగాలు చేసి మెప్పించిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ స్టార్ రెబల్ స్టార్ కృష్ణం రాజు ( Krishnam Raju ) కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. కిచెన్ లో కింగ్ లా వెళ్లిన కృష్ణం రాజా వారు చేపల పులుసు చేశారు. ఈ పులుసు తయారీనీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది కృష్ణం రాజు కూతురు, ప్రభాస్ ( Prabhas ) సోదరి ప్రసీద ఉప్పలపాటి.
Weekend special: Dad’s fish pulusu. My dad makes the best fish in the world!!! And yes, he’s never wrong in telling if there’s enough salt or not, just by its smell. An expert indeed. @UVKrishnamRaju #fishpulusu #weekendspecial #daddydearest pic.twitter.com/7DCFmR51Q1
— Praseedha Uppalapati (@PraseedhaU) August 29, 2020
ఈ వీడియో షేర్ చేసే సమయంలో వీకెండ్ స్పెషల్.. డాడీ చేపల పులుసు సిద్ధం చేశాడు. నాకు తెలిసి చేపల పులుసు వండటంలో ఆయనను మించిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు.. వాసన చూసి ఉప్పు ఎంత ఉందో.. రుచి ఎలా ఉందో చెప్పాస్తారు అని ట్వీట్ చేసింది. కృష్ణం రాజు చేపల పులుసు వండిన వీడియోను చూసి అభిమానులు.. ముఖ్యంగా నాన్ వెజ్ తినే ఫ్యాన్స్ లొట్టలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. మీరు కూడా చూడండి.
Took some time out to make chapala pulusu for the family today!🐠 #weekendspecial pic.twitter.com/blb3z3mona
— U.V.Krishnam Raju (@UVKrishnamRaju) August 29, 2020