నెలలు గడిచేకొద్దీ కరోనా వైరస్ లక్షణాలు (Corona Symptoms) పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కరోనా సోకిందేమోనన్న భయం ఎక్కువైంది. అందులో ముఖ్య లక్షణం జలుబు ఒకటి. ప్రస్తుతం వర్షాకాలం కనుక జలుబు రావడం సర్వసాధారణం. అయితే అది మామూలు జలుబా.. లేక కరోనానా (Smell loss in COVID19 and Common Cold)? అనే భయం జనాల్లో మొదలైంది. వీటిని గుర్తించేందుకు కొన్ని సులువైన మార్గాలున్నాయి. Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా!
బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు కోవిడ్19కు, జలుబుకు గల కొన్ని భేదాలను వివరించారు. ఇందుకోసం ముందుగా ఒకే వయసు ఉన్న కరోనా లక్షణాలున్న, లేని వ్యక్తులపై పరిశోధన జరిపారు. కరోనా సోకితే తలెత్తే శ్వాసకోశ సమస్య ఎక్కువగా ఉంటుందని, వ్యాధి నిరోధక వ్యవస్థ అతిగా స్పందిచాల్సి వస్తుంది. నాడీ వ్యవస్థపై సైతం ప్రభావం చూపుతోంది. కరోనా సోకితే వాసన కోల్పోయే లక్షణం అధికంగా ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా తీపి, చేదు రుచుల్ని కరోనా బాధితులు గుర్తించలేరు. Monsoon Diet; వానాకాలంలో ఈ కూరగాయలు తినాలి.. అసలే కరోనా ఉంది
జలుబు వస్తే.. కరోనా బాధితులకు మొదట్లో ఊపిరి బాగా ఆడుతుందన్నారు. అయితే ముక్కు నుంచి కారడం, గొంతులో తెమడ లాంటి లక్షణాలు ఉండవని రీసెర్చ్‌లో తేలింది. ఈ విషయాలను గుర్తించుకుంటే జలుబు వస్తే అది కరోనానా కాదా అనే అవగాహన ఉంటుందన్నారు. వ్యాధి నిరోధక వ్యవస్థ అతిగా స్పందించే సైటోకైన్ స్టేజ్, నాడీ వ్యవస్థపై కరోనా ప్రభావం చూపుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా వెంటనే కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని బ్రిటన్ వర్సిటీ శాస్త్రవేత్తలు సూచించారు. తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి
COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే
Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి