Mata Vaishno Devi Yatra to start: జమ్మూకాశ్మీర్: కరోనా ( Coronavirus ) లాక్డౌన్, వైరస్ వ్యాప్తి కారణంగా దాదాపు ఐదు నెలలుగా మాతా వైష్ణోదేవి యాత్ర ( Mata Vaishno Devi Yatra ) కు బ్రెక్ పడిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆదివారం నుంచి మాతా వైష్ణోదేవి యాత్రను జమ్మూకాశ్మీర్ ( Jammu Kashmir ) అధికారులు ప్రారంభించారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. కరోనా వ్యాప్తి కారణంగా రోజుకు 2వేల మంది భక్తులకు మాత్రమే ఆలయ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అదికూడా జమ్మూకాశ్మీర్ నుంచి 1,900 మంది, బయటి ప్రాంతాలకు చెందిన 100 మంది భక్తులను అనుమతించనున్నట్లు స్పష్టంచేశారు. Also read: India: 50 వేలకు చేరువలో కరోనా మరణాలు
ఆలయానికి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు వెల్లడించారు. రెడ్జోన్ల నుంచి వచ్చే భక్తులు కరోనా నెగెటివ్ రిపోర్ట్‌తో రావాలని మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు సీఈవో రమేష్ కుమార్ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులందరూ ఆరోగ్యసేతూ యాప్‌తో మాస్కులు ధరించి దర్శనానికి రావాలని.. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మాతా వైష్ణోదేవి యాత్ర బోర్డు ( Shri Mata Vaishno Devi Shrine Board ) పేర్కొంది. Also read: MS Dhoni retirement: సాక్షి ఎమోషనల్ పోస్ట్