ఒకరు క్రిస్టియన్ ( Christian )..మరొకరు ముస్లిం ( Muslim ).. ఇద్దరూ ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకున్నారు..రిజిస్టర్ మేరేజ్ కాదు సాంప్రదాయపు పెళ్లినే. జరిగింది చర్చ్ లో కాదు..నికాహ్ అంతకంటే కాదు. రెంటికీ భిన్నంగా హిందూ వివాహ పద్ధతిలో.
అతడామెను ప్రేమించాడు. ఆమె అతన్ని ప్రేమించింది. అతడు క్రైస్తవుడు. ఆమె ముస్లిం. ఖమ్మం ( Khammam ) జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం దీనికి కేరాఫ్. ఈ గ్రామానికి చెందిన అనిల్ ఇంటర్నీడియట్ పూర్తి చేసి ఆటో నడుపుతున్నాడు. ఖమ్మం అర్బన్ కు చెందిన గొల్లగూడెం గ్రామంలో షేక్ సోనీ అనే ముస్లిం యువతితో పరిచయం కాస్తా ప్రేమ ( love ) గా మారింది. ఇద్దరూ పెళ్లి ( Marriage ) చేసుకోవాలనుకున్నారు. షరా మామూలే..పెద్దలు కాదన్నారు. మరి పెళ్లి ఎలా చేసుకోవాలి..క్రైస్తవ పద్ధతిలోనా లేదా ఇస్లాం ( Islam ) పద్ధతిలోనా అనే ప్రశ్న తలెత్తింది. ఎవర్నీ నొప్పించకుండా..ఎవరిదీ పై చేయిగా అనుకోకుండా..ఆదర్శంగా ఉంటుందనే ఆలోచనతో హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల 49 నిమిషాల సుముహర్తాన వేద మంత్రోఛ్చారణల మధ్య మంగళసూత్రంతో...ఏడడుగులు నడిచి పెళ్లి బంధాన్ని ఏర్పర్చుకున్నారు. అందరూ ఔరా అని ప్రశంసిస్తున్నారిప్పుడు. Also read: COVID-19: తెలంగాణ సర్కార్‌పై బీజేపి చీఫ్ జేపీ నడ్డా ఫైర్