హైదరాబాద్ నగరానికి డిసెంబర్19న రాష్ట్రపతి రానున్నారు. ఆ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్టు టిఎస్ ప్రభుత్వం వెల్లడించింది.
హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 19వరకు తెలుగు మహాసభలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ డిసెంబర్ 19వ తేదీ భాగ్యనగరానికి వస్తున్నారు.
రాష్ట్రపతి షెడ్యూల్ వివరాలు
* డిసెంబర్ 19న మధ్యాహ్నం 2.55 గంటలకు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారు.
* సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉప్పల్ ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రపంచ మహాసభల ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
* ఆయన రాత్రి హైదరాబాద్ లోనే బసచేసి.. మరుసటి రోజు (డిసెంబర్ 20) హుస్సేన్ సాగర్ మధ్య ఉన్న బుద్ధుడికి విగ్రహమాల అలంకరిస్తారు. తరువాత ఆయన ఢిల్లీకి ప్రయాణమవుతారు.
దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి కోవింద్ మరళా డిసెంబర్ 23న హైదరాబాద్ కు వస్తారు. ఆయన డిసెంబర్ 27వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం లో బస చేస్తారు. ఇక్కడి నుంచే ఆయన అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.