అయోధ్యలో ( Ayodhya ) శ్రీ రామ జన్మభూమిపై ( Sri Rama Janmabhoomi) శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి ( Ram Mandir ) ప్రధాని మోదీ భూమి పూజ ( PM Modi in Ayiodhya ) చేయడానికి ముందు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక ట్వీట్ చేసింది. దీర్ఘకాలంగా కొనసాగిన రామమందిర వివాదంపై గత ఏడాది నవంబర్ లో సుప్రీం కోర్డు తీర్పునిచ్చింది. మందిర నిర్మాణ పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు నేడు ఆయోధ్యలో రామ మందిర భూమి పూజ జరిగింది.
( Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు )
అయితే దీనిపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ( Muslim Personal Law Board ) చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. బాబ్రీ మసీదు ( Babri Masjid ) అక్కడే ఉంటుంది అని... ఈ విషయంలో హగియా సోఫియా చక్కటి ఉదాహరణ అంటూనే సుప్రీం కోర్టు తీర్పును సవాలు చేసింది. దాంతో పాటు దిగులు పడవద్దు.. పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండని అని పోస్ట్ చేసింది. కాగా ఈ పోస్టుపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ( Rama Rajya: శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ? రాముడి పాలన ఎలా సాగింది? )
#BabriMasjid was and will always be a Masjid. #HagiaSophia is a great example for us. Usurpation of the land by an unjust, oppressive, shameful and majority appeasing judgment can't change it's status. No need to be heartbroken. Situations don't last forever.#ItsPolitics pic.twitter.com/nTOig7Mjx6
— All India Muslim Personal Law Board (@AIMPLB_Official) August 4, 2020
( Shri Ram Janmabhoomi Mandir in Ayodhya: శ్రీరాముడి గుడి ఇలా ఉండబోతోంది )