ఆంధ్ర ప్రదేశ్: భారతదేశంలో తొలి ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ) త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేయబోతున్నారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ద్వారా భారత ప్రభుత్వం 2012లో మొదటిసారి భారతదేశంలో ఈఎంసీ ఏర్పాటు గురించి ప్రకటించింది. ఈఎంసీ లో మొబైల్ మరియు దాని అనుబంధ ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించిన రూపకల్పన చేస్తారు.
2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రాజధాని అమరావతిలో తొలి మొబైల్ మరియు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అప్పుడే శ్రీ వెంకటేశ్వర మొబైల్ మరియు ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పివీ) ఏర్పడింది. అదే సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
ప్రాజెక్ట్ యొక్క చివరి ఆమోదం కోసం ఎస్పివీ కంపెనీ దరఖాస్తు చేసింది. మూడు పెద్ద భారతీయ మొబైల్ తయారీదారులు - సెల్కోన్, కార్బన్ మరియు లావా ఈఎంసీ లో తమ యూనిట్లను స్థాపించడానికి ముందుకు వచ్చాయి.
మూడు సంస్థలు కోసం సెవెన్ హిల్స్ డిజిటల్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక యాంకర్ యూనిట్ ఏర్పడింది. ఇది మొబైల్ ఫోన్లు మరియు ఇతర సంబంధిత ఎలక్ట్రానిక్ పరికరాల ఉపకరణాలకు తయారీలో పాల్గొంటుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ (ఏపీఐఐసీ) ద్వారా కొత్త క్లస్టర్ కోసం 113.27 ఎకరాల భూమిని కేటాయించారు.
104 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త ఈఎంసీ అభివృద్ధి చేయబడుతుందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి నారా లోకేష్ చెప్పారు. క్లస్టర్ లో ప్రతి ఏటా దాదాపు 50,000 ఉద్యోగాలు సృష్టించబడతాయని మంత్రి చెప్పారు.
దేశంలో తొలి ఈఎంసీ ఏపీలో ఏర్పాటు