AP: రికార్డు స్థాయిలో కేసులు, శృతి మించుతున్న పరిస్థితి

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 8 వేల 147 కేసులు నమోదవడం భయం గొలుపుతోంది.

Last Updated : Jul 24, 2020, 06:14 PM IST
AP: రికార్డు స్థాయిలో కేసులు, శృతి మించుతున్న పరిస్థితి

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 8 వేల 147 కేసులు నమోదవడం భయం గొలుపుతోంది. 

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనా కేసుల ( Corona cases ) సంఖ్య భారీగా పెరుగుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలో మొత్తం కేసుల సంఖ్య రెట్టింపైందంటే పరిస్థితి ఎంతలా శృతి మించుతుందో అర్దం చేసుకోవచ్చు. ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల ( Corona positive cases ) సంఖ్య 80, 858కు చేరుకుంది. ఇందులో కోలుకున్నవారి సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు సగంగా ఉంది. గత 24 గంటల్లో 48 వేల 114 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 933 కు చేరుకుంది. కరోనా నిర్ధారణ పరీక్ష ( Corona tests ) ల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ రాష్ట్రంలో 15 లక్షల 41 వేల 993 మందిని పరీక్షించారు. 

AP CORONA CASES

Trending News