How To Increase Immunity In Kids: కరోనావైరస్ సంక్షోభం ( Coronavirus ) సమయంలో రోగనిరోధక ( Immunity ) శక్తి అత్యంత ప్రధానమైన అంశం. పెద్దలకు ఓకే కానీ..పిల్లల విషయంలో మాత్రం రోగనిరోధక శక్తి తక్కువగా ( Immunity In Kids ) ఉంటుంది. పైగా వర్షాకాలంలో పిల్లలకు సులభంగా ఫ్లూ, దగ్గు, ఫీవర్ వస్తుంటుంది. అందుకే వారి ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆహారంలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి. (
Beauty Tips: ఇంట్లోనే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకునే చిట్కాలు )
1.క్యారెట్లు..
పిల్లల పెరుదలకు, ఆరోగ్యానికి విటమిన్ ఎ ( Vitamin A ) , జింక్ ( Zinc ) చాలా ముఖ్యం. అందుకే వారి ఆహారంలో క్యారెట్లు ఉండేలా చూసుకోండి. క్యారెట్‌తో కంటిచూపు మెరుగు అవుతుంది. దాంతో వారి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
2. పెరుగు
పిల్లల శరీరంలో ఉండే బ్యాక్టీరియా నశించాలి అంటే వారికి పెరుగు ( Curd ) తప్పకుండా తినిపించాలి. పెరుగు తినడం వల్ల అందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు గట్టిగా మారుతాయి. ( How To Become Slim: స్లిమ్ అవ్వాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి
3. బత్తాయి, నిమ్మకాయ..
నారింజ, బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లు తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సీ ( Vitamin C ) వల్ల ఫ్లూ, జలుబు, ఫీవర్ తగ్గుతుంది.
4. బాదం, పిస్తా
బాదం ( Badam ) , పిస్తా, జీడిపప్పు (Cashew ) తినడం వల్ల అందులో ఉండే పోషకాల వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. పిల్లలు బలంగా మారుతారు. ఆరోగ్యంగా మారుతారు.
Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Follow us on twitter