భారత్ Vs చైనా.. పెద్దన్న అమెరికా కీలక ప్రకటన

India Vs China | గాల్వన్ లోయ వివాదంలో 20 మంది భారత జవాన్లు అమరులైన తర్వాత భారత్, చైనాల మధ్య పరిస్థితులు కాస్త ఉద్రికత్తంగా మారాయి. ముఖ్యంగా భారత్‌లో చైనా వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయి. అయితే తమ మద్దతు భారత్‌కే ఉంటుందని అమెరికా స్పష్టం చేసింది.

Last Updated : Jun 26, 2020, 09:37 AM IST
భారత్ Vs చైనా.. పెద్దన్న అమెరికా కీలక ప్రకటన

India Vs China | డ్రాగన్ దేశం చైనా నుంచి భారత్‌తోపాటు పలు దేశాలకు ముప్పు ఉందని, దానిని ధీటుగా ఎదుర్కొనేందుకు అమెరికా ఆయా ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరిస్తుందని అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి మైక్ పాంపియో పేర్కొన్నారు. చైనాతో పోరులో భారత్‌కు అమెరికా సైన్యం మద్దతు ఉంటుందన్నారు. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి

భారతదేశం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశాలకు చైనా (China) నుంచి ముప్పు పెరుగుతుందని... ఈ దేశాలతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా అమెరికా సైన్యాన్ని (America Army) మోహరించడానికి సమీక్షిస్తోందని వారి విదేశాంగశాఖ కార్యదర్శి మైక్ పాంపియో (Mike Pompeo) స్పష్టం చేశారు. అవసరమైతే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (People's Liberation Army) తో ఎదుర్కొనే విధంగా సైన్యాన్ని మోహరిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం

గురువారం జరిగిన జర్మన్ మార్షల్ ఫండ్ వర్చువల్ బ్రస్సెల్స్ ఫోరం 2020 సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. పాంపియో ఈ విషయం చెప్పారు.  తమ విస్తరణను పీఎల్‌ఏ (PLA)ను ఎదుర్కొనేలా పెంచుతామని, దీనిని ప్రస్తుతం సవాల్‌గా తీసుకున్నట్లు చెప్పారు. డ్రాగన్‌ను ఎదుర్కొనేందుకు తమ దగ్గర అన్నీ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు.  Photos: జబర్దస్త్ యాంకర్ అనసూయ హొయలు

ట్రంప్ సూచనలతోనే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సూచనల మేరకు దళాల మోహరింపును సమీక్షిస్తున్నామని పాంపియో తెలిపారు. ఈ మేరకు జర్మనీలో ఉన్న తమ సైనికుల సంఖ్యను 52 వేల నుంచి 25 వేలకు అమెరికా తగ్గిస్తుందన్నారు. భూ పరిస్థితుల ఆధారంగా దళాలను మోహరిస్తామన్నారు. చైనాతో  ఇప్పుడు భారతదేశం, వియత్నాం,  మలేషియా, ఇండోనేషియా పలు దేశాలకు ముప్పు ఉందని, దక్షిణ చైనా సముద్రంలో కూడా అనేక సవాళ్లు ఉన్నాయని పాంపియో చెప్పారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Trending News