నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్.. టాలీవుడ్‌లో ఆందోళన, ఎవరెవరిని కలిశారో!

Bandla Ganesh Tested COVID19 Positive | కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. వ్యాపారవేత్తలు, డాక్టర్లు, రాజకీయ నాయకులు కోవిడ్19 బారిన పడుతుండగా తాజాగా టాలీవుడ్‌కు కరోనా వైరస్ పాకింది. నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా సోకినట్లు తెలుస్తోంది.

Last Updated : Jun 20, 2020, 11:49 AM IST
నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్.. టాలీవుడ్‌లో ఆందోళన, ఎవరెవరిని కలిశారో!

టాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడగా తాజాగా సినీ ప్రముఖులకు కరోనా పాజిటివ్‌గా రావడం ఆందోళన కలిగిస్తోంది. నటుడు, నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh)‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. బండ్ల గణేష్ తరచుగా షాద్‌నగర్‌లోని తన ఫౌల్ట్రీ ఫారమ్‌కు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా కోవిడ్19 పాజిటివ్‌ (Bandla Ganesh Tested COVID19 Positive)గా నిర్ధారించారు. ఆగస్టులో Niharika నిశ్చితార్థం, కాబోయే భర్తతో నిహారిక ఫొటోలు వైరల్

హైదరాబాద్‌లో ఓ గేటెడ్ కమ్యూనిటీలో నిర్మాత బండ్ల గణేష్ నివాసం ఉంటున్నారు. ఇదే కమ్యూనిటీలో కళామందిర్ కళ్యాణ్, నటుడు నాగశౌర్య కుటుంబం, ఇతర ప్రముఖులు ఉంటున్నారు. దీంతో ఆయన ఇటీవల ఎవరెవరిని కలిశారు, ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తుల వివరాలను అధికారులు, పోలీసులు సేకరిస్తున్నారు. అయితే బండ్ల గణేష్, ఆయన కుటుంబంగానీ అధికారికంగా మాత్రం ఏ ప్రకటన చేయలేదు. Producer Bandla Ganesh tests positive for coronavirus   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Trending News