Locusts attacks: మిడతల దండు దాడి నుంచి తెలంగాణ సేఫ్

Locusts swarms attacks: మిడతల దండు నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు ప్రస్తుతానికి తప్పింది. మిడుతల దండు ( Locusts swarms ) తెలంగాణ సరిహద్దులకు 200 కిమీ సమీపానికి రావడంతో అవి ఏ క్షణమైనా తెలంగాణలోకి ( Telangana ) ఆ తర్వాత తెలంగాణ నుంచి ఏపీలోకి ( Andhra Pradesh ) ప్రవేశిస్తాయని రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైంది.

Last Updated : Jun 1, 2020, 07:54 PM IST
Locusts attacks: మిడతల దండు దాడి నుంచి తెలంగాణ సేఫ్

హైదరాబాద్ : Locusts swarms attacks: మిడతల దండు నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు ప్రస్తుతానికి తప్పింది. మిడుతల దండు ( Locusts swarms ) తెలంగాణ సరిహద్దులకు 200 కిమీ సమీపానికి రావడంతో అవి ఏ క్షణమైనా తెలంగాణలోకి ( Telangana ) ఆ తర్వాత తెలంగాణ నుంచి ఏపీలోకి ( Andhra Pradesh ) ప్రవేశిస్తాయని రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైంది. ముఖ్యంగా మహారాష్ట్రను ఆనుకుని ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అన్నదాతలను మిడతల దండు దాడుల వార్తలు మనశ్శాంతి కరువయ్యేలా చేశాయి. ఏ క్షణం ఎటువైపు నుంచి ఎగిరొస్తాయో తెలియని మిడతల మంద నుంచి ఎకరాల కొద్ది పంటను ఎలా కాపాడుకోవడం అనే ఆందోళన రైతులు దిగాలు చెందారు. ( Monsoon updates: కేరళను తాకిన రుతుపవనాలు.. విస్తారంగా కురుస్తున్న వర్షాలు )

దారి మార్చుకున్న మిడతల దండు:అయితే, అదృష్టవశాత్తుగా ఆ మిడుతల దండు తెలుగు రాష్ట్రాల వైపు రాకుండా మహారాష్ట్రలోని విదర్భ నుంచి మధ్యప్రదేశ్‌ వైపు మళ్లాయి. ఆ తర్వాత తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌ఘడ్ అడవుల్లోకి ( Locusts swarms in Chhattisgarh ) మిడుతల దండు ప్రవేశించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌ఘడ్‌‌లోని కొరియా జిల్లాలోని అటవీ ప్రాంతంలోకి మిడుతలు ప్రవేశించాయి. దీంతో మిడతల దండు దాడి నుంచి ఎలా బయటపడాలా అని తలలు పట్టుకోవడం అక్కడి అక్కడి అధికారుల వంతయ్యింది. మిడతల దండుపై తెలంగాణ దండయాత్ర ) 

మిడతల మంద దారి మళ్లడానికి అదే కారణం..
సహజంగానే తేలికపాటి బరువుండే మిడతలకు గాలి వీచే వైపు ఎగిరివెళ్లే అలవాటు ఉంటుంది. గాలి వీచే వైపునకు ఎగరడం వల్ల వాటికి ఎక్కువ శక్తి అవసరం లేకుండానే అవి తమ స్థలాలు మార్చుకుంటుంటాయి. అలా కొత్త ప్రాంతాలను చేరుకుంటాయి. అలా కాకుండా గాలికి ఎదురుగా ఎగిరి ప్రయాణించాలంటే.. సాధారణ శక్తి కంటే మూడు రెట్ల శక్తి అవసరం ఉంటుంది. సరిగ్గా ఈ సూత్రమే మిడతల దండును మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు కాకుండా మధ్యప్రదేశ్ వైపు మళ్లేలా చేశాయంటున్నారు శాస్త్రవేత్తలు.

 

మిడతల దండు నుంచి ముప్పు తప్పినట్టేనా ?
మిడతల దండు నుంచి ముప్పు తప్పినట్టేనా అంటే.. ఆ ప్రశ్నకు కచ్చితంగా అవుననే జవాబు చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందుకు కారణం అవి గాలి ఎటువైపు బలంగా వీస్తే... అటువైపే ప్రయాణించడం. అంతేకాకుండా రోజుకు గరిష్టంగా 150 కిమీ దూరం వరకు ప్రయాణించే శక్తి ఈ మిడతల దండు సొంతం. అందుకే మిడతల దండు నుంచి శాశ్వతంగా ముప్పు తప్పినట్టేనని భావించే పరిస్థితి కూడా కనబడటం లేదు. 
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News