Chiranjeevi, రామ్ చరణ్, ఉపాసనలపై తేనేటీగల దాడి

అంత్యక్రియలకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై తేనేటీగలు అకస్మాత్తుగా దాడి చేశాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండలో ఆదివారం చోటుచేసుకుంది.

Last Updated : May 31, 2020, 02:06 PM IST
Chiranjeevi, రామ్ చరణ్, ఉపాసనలపై తేనేటీగల దాడి

Umapati Rao Kamineni Last Rites | రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ (Ram Charan) - ఉపాసన దంపతులు, కొందరు కుటుంబసభ్యులు హాజరయ్యారు. దోమకొండ సంస్థాన వారసుడు ఉమాపతిరావు మనవరాలు ఉపాసన అని తెలిసిందే. అయితే అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో తేనేటీగలు ఒక్కసారిగా చిరంజీవి కుటుంబంతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన వారిపై దాడి చేశాయి. LockDown5.0పై కడుపుబ్బా నవ్వించే జోక్స్

ఉపాపతిరావు గత బుధవారం తుదిశ్వాస విడవగా, ఆదివారం (మే 31న) ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భౌతికదేహాన్ని దొమకొండ కోటలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అంత్యక్రియలకు కామినేని కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. అంతకు ముందు ఉమాపతిరావు పార్థివదేహానికి జిల్లా కలెక్టర్‌ శరత్ కుమార్, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందన్ లాల్ పవార్, అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దొత్రే నివాళులర్పించారు. 11:45 గంటల వరకు అంత్యక్రియలకు అన్ని ఏర్పాటు చేశారు.  విశ్వనాథన్ ఆనంద్‌కు 14 రోజుల క్వారంటైన్‌

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో స్థానిక లక్ష్మీబాగ్‌కు దహన సంస్కారాలకు వెళ్తుండగా తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసనలతో పాటు కామినేని కుటుంబసభ్యులపై తేనేటీగల దాడి జరిగింది. ఉమాపతిరావు కుమారుడు అనిల్‌ కుమార్‌ కామినేనితో పాటు కూతురు శోభ అక్కడే ఉన్నారు.  సోషల్ మీడియా ఖాతాలు డిలీట్ చేసిన నటి

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని సురక్షితంగా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, అమెరికా నుంచి కూతురు శోభ, అల్లుడు రావడం కోసమే అంత్యక్రియలను ఆదివారానికి వాయిదా వేయడం తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి
 

Trending News