అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ( Aarogyasri scheme in AP ) మరింత విస్తరిచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సీఎం క్యాంప్ ఆఫీస్లో ‘మన పాలన–మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా 5వ రోజున ‘వైద్యం–ఆరోగ్యం’పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) మేధోమథనం నిర్వహించారు. లబ్ధిదారులు, వైద్య నిపుణులు, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ( సీఎం జగన్కు అమిత్ షా ఫోన్.. లాక్డౌన్ కొనసాగింపుపైనే చర్చ )
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజారోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలు, వెచ్చిస్తున్న బడ్జెట్ గురించి సీఎం వైఎస్ జగన్ పలు వివరాలు వెల్లడించారు. ప్రజారోగ్యం కోసం ఇప్పటివరకు గత ఏడాది కాలంలో మొత్తం మీద 16 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ( Aarogyasri healthcare scheme ) 5 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వారికి కూడా వర్తింప చేశామన్న ముఖ్యమంత్రి, ఆ మేరకు జీఓ కూడా జారీ చేశామని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 1.42 కోట్ల కుటుంబాలు ఉన్నాయని.. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే వారికి ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని 2 వేల వ్యాధులకు విస్తరిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు ( Pilot project ) అమలు చేశామని సీఎం వెల్లడించారు. వచ్చే జూలై 8 నాటికి మరో 6 జిల్లాలకు ఆ ప్రాజెక్టును విస్తరింపజేస్తామని, ఆ తర్వాత మిగిలిన 6 జిల్లాల్లో నవంబరు నెలలో దీపావళి నుంచి ఆ ప్రాజెక్టును అమలు చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ( Read also : Kondapochamma Sagar : రైతులకు గుడ్ న్యూస్ : కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ )
ఆంధ్రప్రదేశ్తో పాటు ఏపీకి చెందిన తెలుగు వారు అధికంగా నివసిస్తున్న హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని.. వైద్యం కోసం పేదలు అప్పులపాలు కాకూడదనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..