Gold rate jumps: భగ్గుమన్న బంగారం ధరలు..

గత మూడు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు, కరోనా మహమ్మారి విజృంభణ తీవ్రం కావడం పలు కారణాల వల్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాములకు

Last Updated : May 29, 2020, 07:37 PM IST
Gold rate jumps: భగ్గుమన్న బంగారం ధరలు..

హైదరాబాద్: గత మూడు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు, కరోనా మహమ్మారి విజృంభణ తీవ్రం కావడం పలు కారణాల వల్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాములకు రూ.152 పెరిగి రూ.46,557 పలికింది. వెండి కిలో రూ.167 పెరిగి రూ.48,725 వద్ద ఆగిపోయింది. పసిడి ఈ నెల ప్రారంభంలో రూ.45,556 ఉండగా 15వ తేదీన రూ.47360 పెరిగి  స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 

Also Read:  ( AP High Court : ఏపీ సర్కార్‌కి షాక్ ఇచ్చిన హై కోర్టు )

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్పాట్ గోల్డ్ ధరలు మళ్ళీ పెరిగాయి. అమెరికాలో 1,734.60 డాలర్లు ఉండగా పల్లాడియం ఔన్స్ 1,930.67 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. వెండి ఔన్స్ కాస్త తగ్గి 830.81 డాలర్ల వద్ద, వెండి 0.3 శాతం తగ్గి ఔన్స్ 17.38 డాలర్లుగా నమోదయ్యింది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.48,100 వద్ద ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.44,3100 వద్ద ఆగిపోయింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News