ఎప్పటినుంచో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. లక్షలాది ఎకరాలను నీటితో తడిపేందుకు సిద్ధం చేసిన కొండపోచమ్మ సాగర్‌లో నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సుదర్శన యాగం నిర్వహించిన అనంతరం చినజీయర్ స్వామితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్కూక్ పంప్ హౌజ్‌ను ప్రారంభించారు. పంప్ హౌస్ స్విచ్ఛాన్ చేయగానే గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లోకి చేరుకున్నాయి. Photos: తెలంగాణలో మహత్తర ఘట్టం
గోదావరి జలాలు 600 మీటర్లకు పైకి వచ్చి కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి