కరోనా పాజిటివ్ మహిళ.. కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. తల్లీ, బిడ్డలు ముగ్గురూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
మధ్యప్రదేశ్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లే .. మధ్యప్రదేశ్ లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తున్న ఈ కాలంలో బిడ్డకు జన్మనివ్వడం అంటే సాధారణ విషయం కాదు. ఈ క్రమంలో నిండు గర్భిణుల పరిస్థితి దారుణంగా ఉంది. తరచూ ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వారిది. అలాగే ఇండోర్ లో ఓ నిండు గర్భిణీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇంతలో ఆమె డెలివరీ తేదీ దగ్గరపడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఇండోర్ లోని MTH ఆస్పత్రిలో చేర్పించారు.
కరోనా పాజిటివ్ గా ఉన్న ఆమె.. కవల పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణ కాన్పు ద్వారానే ప్రసవం జరిగిందని ఆస్పత్రి ఇంచార్జి డాక్టర్ సుమిత్ శుక్లా వెల్లడించారు. పుట్టిన పిల్లలు ఇద్దరితోపాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. పిల్లలకు కరోనా సోకలేదని వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
కరోనా పాజిటివ్ మహిళకు కవలలు..!!